close

ఆంధ్రప్రదేశ్

130 స్థానాలు మనవే: చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ఈ ఎన్నికల్లో నూటికి నూరుశాతం తెదేపా ఘన విజయం సాధిస్తుందని, 130 స్థానాలకుపైగా గెలుచుకుంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం తెదేపాకు 130 శాసనసభ స్థానాలు వస్తాయని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద షిఫ్టుల వారీగా కాపలా కాయాలని సూచించారు. ‘మన ప్రత్యర్థులు నిస్పృహలో ఉన్నారు. అందుకే మనవాళ్లపై దాడులు చేశారు. చంపడమా? చంపించుకోవడమా? అని వైకాపా నేతలు ముందే మాట్లాడారు. దానికి తగ్గట్టే హింసాకాండకు దిగారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మహిళలు, వృద్ధులు మనతోనే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలతకు ఈ ఓటింగ్‌ సరళే నిదర్శనం. ప్రజలు తెదేపా పక్షానే నిలిచారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు