Prime Video Channels: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మరిన్ని ఛానెళ్లు - Amazon launches Prime Video Channels
close

Published : 24/09/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prime Video Channels: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మరిన్ని ఛానెళ్లు

దిల్లీ: వీక్షకుల మరింత విస్తృత స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు మరో ఎనిమిది స్ట్రీమింగ్‌ సర్వీసులతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. డిస్కవరీ+, లయన్స్‌గేట్‌ ప్లే, ఎరోస్‌ నౌ, డాక్యుబే, ముబి, హొయ్‌చొయ్‌, మనోరమా మ్యాక్స్‌, షార్ట్స్‌ టీవీ ఛానెళ్లను సైతం ప్రైమ్‌ వీడియో వేదికపై చూడొచ్చని వెల్లడించింది. 

ఇవి యాడ్‌ ఆన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కింద వీక్షకులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటి వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు ఇలా ఉన్నాయి.. డిస్కవరీ+ రూ.299, ఎరోస్‌ నౌ రూ.299, లయన్స్‌గేట్‌ ప్లే రూ.699, మనోరమా మ్యాక్స్‌ రూ.699, ముబి రూ.1999, షార్ట్స్‌ టీవీ రూ.299. ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు డిస్కవరీ+, ఎరోస్‌ నౌ 25 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నాయి. హొయ్‌చొయ్‌ 33 శాతం, మనోరమా మ్యాక్స్ 30 శాతం‌, షార్ట్స్‌ టీవీ 40 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ముబి సైతం ప్రవేశ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని