Byjus: గ్రేట్‌ లెర్నింగ్‌ కొనుగోలుతో ఉన్నత విద్యా రంగంలోకి బైజూస్‌! - Byjus entering higher education by aquiring Great Learning
close

Published : 26/07/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Byjus: గ్రేట్‌ లెర్నింగ్‌ కొనుగోలుతో ఉన్నత విద్యా రంగంలోకి బైజూస్‌!

దిల్లీ: దేశీయ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌ కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘గ్రేట్‌ లెర్నింగ్‌’ యాప్‌ను సొంతం చేసుకుంది. దీంతో బైజూస్ ఉన్నత విద్యారంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ లావాదేవీ విలువ 600 మిలియన్‌ డాలర్లు. ఈ మొత్తాన్ని కొంత నగదు రూపంలో చెల్లిస్తుండగా.. మరికొంత స్టాక్‌లు, ఎర్న్‌ఔట్‌ల రూపంలో ఇవ్వనుంది. ఉన్నత విద్య, ప్రొఫెషనల్‌ కోర్సులు అందించే సేవల్లో మరింత వృద్ధి సాధించేలా రానున్న రోజుల్లో గ్రేట్‌ లెర్నింగ్‌పై 400 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు బైజూస్‌ ప్రకటించింది. బైజూస్‌ ఆధ్వర్యంలో గ్రేట్‌ లెర్నింగ్‌ స్వతంత్ర సంస్థగా కొనసాగనుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని