Baricitinib తయారీకి సిప్లా ఒప్పందం - Cipla To Make Baricitinib Drug For Covid Treatment
close

Updated : 10/05/2021 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Baricitinib తయారీకి సిప్లా ఒప్పందం

దిల్లీ: కొవిడ్‌-19 వ్యాధి బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలుకల్పించే 'బారిసిటినిబ్‌' ఔషధాన్ని భారత్‌లో తయారు చేసి విక్రయించేందుకు అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ ఔషధ సంస్థతో దేశీయ ఔషధ తయారీ సంస్థ సిప్లా లిమిటెడ్ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకొంది. బారిసిటినిబ్‌ను ఇప్పటి వరకూ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వ్యాధిని అదుపు చేయటానికి వినియోగిస్తున్నారు. దీన్ని ఆస్పత్రుల్లో చేరిన కొవిడ్‌-19 బాధితులకు 'రెమ్‌డెసివిర్‌' ఔషధంతో కలిపి ఇవ్వటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) గతేడాది నవంబరులో అత్యవసర అనుమతి ఇచ్చింది. తాజాగా భారత్‌లో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) 'అత్యవసర అనుమతి' మంజూరు చేసింది.

దేశవ్యాప్తంగా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొవిడ్‌-19 చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న దేశీయ సంస్థల్లో సిప్లా ముందు వరుసలో ఉంది. ఇప్పటికే  రెమ్‌డెసివిర్‌, ఫావిపిరావిర్‌, టోసిలిజుమాబ్‌ వంటి ఔషధాలను సిప్లా తయారు చేస్తోంది. తాజాగా బారిసిటినిబ్‌ ఆ జాబితాలో చేరింది. మరోవైపు రోచే అండ్‌ రీజెనెరాన్‌ అభివృద్ధి చేసిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని సైతం భారత్‌లో పంపిణీ చేసేందుకు హక్కులు పొందామని తెలిపింది. భారత్‌లో ఈ కాక్‌టెయిల్‌ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ ఇటీవలే అనుమతి ఇచ్చింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని