E-Commerce: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనన్న హైకోర్టు! - Flipkart Amazon faces setback in karnataka High court
close

Published : 23/07/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

E-Commerce: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనన్న హైకోర్టు!

బెంగళూరు: తాము అవలంబిస్తున్న అంతర్గత వ్యాపార విధానాలపై విచారణను నిలిపివేయాలంటూ అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ చేసిన అభ్యర్థనలను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్లకు విచారణయోగ్యత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మార్కెట్‌లో ఉన్న పోటీనీ కొల్లగొడుతూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ఈ ఇ-కామర్స్‌ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయని భారత్‌లోని వ్యాపార సంస్థల ఆరోపణల్ని ‘కాంపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)’ గత ఏడాది పరిగణనలోకి తీసుకుంది. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించింది. కానీ, తమపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని.. అందుకు సంబంధించి సీసీఐ వద్ద ఎలాంటి రుజువులు లేవని ఇ-కామర్స్‌ సంస్థలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అప్పీళ్లు సీసీఐ నిర్ణాయక అధికారాన్ని సవాల్‌ చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది. పైగా వీరి చర్యలు విచారణను మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని బలోపేతం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే విదేశీ నిధుల కోసం కఠిన నిబంధనలు ఎదుర్కొంటున్న ఇ-కామర్స్‌ సంస్థలకు తాజా కోర్టు తీర్పు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అలాగే గందరగోళ వ్యాపార విధానాలతో భారత చట్టాలను ఇ-కామర్స్‌ సంస్థలు అతిక్రమిస్తున్నాయని ఇక్కడి వ్యాపార సంస్థలు ఆరోపిస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని