జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్‌ రికార్డ్‌! - GST collection touches Rs 1.20 lakh crore
close

Published : 31/01/2021 21:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్‌ రికార్డ్‌!

దిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భారీగా క్షీణించిన జీఎస్టీ వసూళ్లు భారీగా పుంజుకున్నాయి. జనవరి నెలకు గానూ అత్యధికంగా దాదాపు రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీమొత్తంలో వసూలు అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతేడాది జనవరితో పోలిస్తే 8 శాతం అధికంగా వసూలయ్యాయి. గతేడాది ఇదే నెలకు రూ.1.11 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలయ్యాయి.

జనవరి 31 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మొత్తం రూ.1,19,847 కోట్లు కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ కింద రూ.21,923 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.29,014 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.60,288 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో రూ.8,622 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జీఎస్టీఆర్‌-2బీ రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకు గత నెల వసూలైన రూ.1.15 లక్షల కోట్లే రికార్డు కాగా.. ఆ రికార్డును తాజా వసూళ్లు చెరిపేశాయి.

ఇవీ చదవండి...
బీమా రంగానికి పెట్టుబడి ధీమా..!
బడ్జెట్‌: పరిశ్రమ వర్గాలు ఏం కోరుతున్నాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని