close

తాజా వార్తలు

Published : 21/02/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హోండా నుంచి బీఎస్‌-6 షైన్‌

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) గురువారం బీఎస్-6 ప్రమాణాలు కలిగిన కొత్త షైన్‌ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.67,857 (ఎక్స్‌ షోరూం-దిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. షైన్‌ గత వెర్షన్‌తో పోలిస్తే బీఎస్‌-6తో కూడిన కొత్త వెర్షన్‌ 14శాతం అదనపు మైలేజీని అందిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

125 సీసీ విభాగంలో షైన్ మరో విప్లవమని, దేశంలో తమ వ్యాపార విస్తరణకు ఇది తోడ్పడుతుందని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్‌, సీఈవో, ఎండీ మినోరు కటో అభిప్రాయపడ్డారు. బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన 2.5 లక్షల ద్విచక్రవాహనాలను ఇప్పటికే విక్రయించామని తెలిపారు. ఇప్పటి వరకు 80 లక్షల షైన్‌ బైక్‌లను విక్రయించామని హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) యద్వీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు. 5స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బీఎస్‌-6 షైన్‌ ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఏప్రిల్‌ 1 నుంచి విక్రయించే వాహనాలన్నీ బీఎస్‌-6 ప్రమాణాలు కలిగి ఉండాలని కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.