ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెట్టుబ‌డులు ఎలా ఉండాలి? - How-you-should-diversify-your-portfolio-this-year
close

Published : 08/07/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెట్టుబ‌డులు ఎలా ఉండాలి?


 పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ కోసం,  స్టాక్ మార్కెట్లు, బంగారం, స్థిర ఆదాయం, కరెన్సీ వంటి పెట్టుబ‌డుల్లో దేనికి ఎంత కేటాయించాలో నిపుణులు  చెప్పిన స‌ల‌హాల‌ను ప‌రిశీలిస్తే....
ఈక్విటీలు: 
 స్మాల్ , మిడ్‌క్యాప్ సూచీలు బ‌ల‌మైన మ‌ద్ద‌తుతో జూన్ నెల‌లో ఈక్విటీ మార్కెట్ల‌లో మంచి లాభాలు న‌మోద‌య్యాయి.  బలమైన బుల్ మార్కెట్ కొనసాగింపును సూచిస్తూ మార్కెట్‌లో అస్థిరత తగ్గుతూనే ఉంది. చిన్న‌ మధ్య, లార్జ్ క్యాప్‌లు కూడా మంచి ప‌నితీరును క‌న‌బ‌రుస్తున్నాయి. కంపెనీల మొద‌టి త్రైమాసిక ఫ‌లితాలు, క‌రోనా వ్యాప్తి వంటివి మార్కెట్లో బ‌ల‌మైన ప్ర‌భావం చూపే అంశాలుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. బ్రోక‌రేజ్ సంస్థ‌లు కూడా డిసెంబ‌ర్ 2021 నాటికి నిఫ్టీ ల‌క్ష్యాన్ని 17000-17500 వ‌ర‌కు అంచ‌నా వేస్తున్నాయి. కాబ‌ట్టి ఈక్విటీల‌లో పెట్టుబ‌డుల‌కు మంచి స‌మ‌య‌మే అని చెప్తున్నారు. అయితే దీనికి త‌గిన ప్ర‌ణాళిక‌లు, ఆర్థిక స‌ల‌హాదారుల సూచ‌న‌లు తీసుకొని ముందుకెళ్లాలి. ఎందుకంటే మార్కెట్ల‌ను ఎవ‌రైనా అంచ‌నా మాత్ర‌మే వేయ‌గ‌ల‌రు కానీ, క‌చ్చితంగా చెప్ప‌లేరు కాబ‌ట్టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఫ‌లితాలు తారుమారు కూడా కావొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబ‌డుల‌ను కేటాయించ‌ని నిపుణుల స‌ల‌హా. 

స్థిర ఆదాయం:
 బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు (ఓఎంఓ), ప్రభుత్వ సెక్యూరిటీల సేక‌ర‌ణ వంటి  ఆర్‌బీఐ చేసిన ప్రయత్నాల కారణంగా బాండ్ దిగుబడి నెలలో 6 శాతం వద్ద స్థిరంగా ఉంది. జూన్ ఆర్‌బీఐ స‌మీక్ష‌లో లిక్విడిటీ కీలక అంశంగా మారింది. చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వడం వ్యవస్థలో ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం.  అయితే బాండ్ల‌లో పెట్టుబ‌డులు పేట్టేట‌ప్పుడు రేటింగ్ అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌ని తెలిపారు. 
బంగారం: 
యుఎస్ ఫెడ్ మరింత కఠినమైన వైఖరి కారణంగా జూన్‌లో బంగారం ధరలు  4-7 శాతం హెచ్చుత‌గ్గులకు లోన‌య్యాయి. జూన్ చివ‌రి రెండు వారాల్లో డాల‌ర్ మ‌రింత బ‌ల‌ప‌డ‌టంతో బంగారం ధ‌ర‌ల‌పై ఒత్తిడి ఏర్ప‌డింది. దీంతో ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల క‌నిపించింది.   ద్వితీయార్థంలో టీకాల ఉత్ప‌త్తిలో వేగం పెర‌గ‌డంతో మెరుగైన ఆర్థిక దృక్ప‌థంతో బ్రోక‌రేజ్ సంస్థ‌లు ఉన్నాయి. బంగారం ధ‌ర‌లు స‌మీక కాలంలో ప‌రిమితంగానే ఉన్నా ఇత‌ర పెట్టుబ‌డుల‌కు వ్య‌తిరేకంగా హెడ్జింగ్ కోసం నిధుల‌ను కేటాయించ‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. దీంతో పాటు ధ‌ర త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడే కొనుగోలు చేయ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని