close

తాజా వార్తలు

Published : 15/08/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌బీఎఫ్‌సీలకు పెరిగిన బ్యాంకు రుణాలు

 కేర్‌ రేటింగ్‌

ముంబయి: దేశంలో ద్రవ్యలభ్యతను పెంచేందు కోసం బ్యాంకింగేతర రుణ సంస్థలకు మరిన్ని రుణాలివ్వాలని అందరూ చెబుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల నుంచి రుణాలు పెరగడం విశేషం. సెప్టెంబరు 2018 నుంచి జూన్‌ 2020 వరకు గణాంకాలను చూస్తే 190 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగి 8.8 శాతానికి ఆ రుణాలు చేరాయని కేర్‌ రేటింగ్‌ ఒక నివేదికలో చెబుతోంది. ఆ నివేదిక ఇంకా ఏం చెబుతోందంటే..
* ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులిచ్చిన రుణాలు జూన్‌ 2020లో 47.1 శాతం వృద్ధితో రూ.7.99 లక్షల కోట్లకు చేరాయి. ఇవి సెప్టెంబరులో రూ.5.47 లక్షల కోట్లు మాత్రమే.
* మ్యూచువల్‌ ఫండ్‌ల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలు తగ్గాయి. ఏప్రిల్‌ 2020 వరకు ఫండ్‌ల నుంచి ఎన్‌బీఎఫ్‌సీ రుణాలు తగ్గుతూ వచ్చి రూ.1.34 లక్షల కోట్లకు చేరాయి. అయితే మే 2020లో మాత్రం కాస్తంత పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబరు 2018 నాటి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఉదంతంతో బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ ప్రవాహం ఆగిన విషయం విదితమే.
* బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీలకిచ్చిన రుణాల వాటా సెప్టెంబరు 2018న 6.9 శాతంగా ఉండగా.. జూన్‌ 2020 నాటికి 8.8 శాతానికి చేరాయి.
* ప్రైమరీ మార్కెట్‌ నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు ఫండ్‌ల నుంచి సమీకరించిన మొత్తం కూడా జూన్‌ 2020లో రూ.30,000 కోట్లకు తగ్గింది. మార్చి 2019లో ఇవి రూ.80,000 కోట్లుగా ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం తర్వాత బ్యాంకుల నుంచే ప్రధానంగా అవి నిధులను పొందాయి.
* మరో వైపు వాణిజ్య పత్రాల్లో (సీపీ) పెట్టుబడులు మాత్రం స్థిరంగా కనిపించాయి. మార్చి 2020లో రూ.94,000 కోట్లుగా ఉండగా.. జూన్‌ 2020 నాటికి అవి రూ.84,000 కోట్లకు చేరాయి.
ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ కనెక్షన్‌పై 1000జీబీ అదనపు డేటా
స్వాతంత్య్ర దినోత్సవం ఆఫర్‌లో భాగంగా ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా 1000 జీబీ డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ పరిమిత కాల ఆఫర్‌ అన్‌లిమిటెడ్‌ డేటా, ప్రీపెయిడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు మినహాయించి అన్ని ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్‌లపై వర్తిస్తుందని తెలిపింది. ఈ అదనపు డేటా కాలపరిమితి ఆరు నెలలు. ప్రస్తుతం సంస్థ దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తోంది.
ఇండిగ్రిడ్‌లో 14.7% వాటా విక్రయించిన స్టెరిలైట్‌ పవర్‌
ఇండియా గ్రిడ్‌ ట్రస్ట్‌లో 14.7 శాతం వాటాను రూ.840 కోట్లకు విక్రయించినట్లు స్టెరిలైట్‌ పవర్‌ వెల్లడించింది. సంస్థాగత మదుపర్లు, అధిక సంపన్న వర్గాలు (హెచ్‌ఎన్‌ఐలు) ఈ వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇండిగ్రిడ్‌.. విద్యుత్‌ రంగంలో మొట్టమొదటి మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్‌.
సెంట్రల్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ కోత
ముంబయి: నిధులపై వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తగ్గించింది. వివిధ కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను అయిదు బేసిస్‌ పాయింట్లు (0.05 శాతం) మేర కోత విధించింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ చెప్పింది. ఏడాది కాలవ్యవధి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 7.20 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు బ్యాంక్‌ 85 బేసిస్‌ పాయింట్లు కోత వేసింది. ఇక ఒక రోజు నుంచి ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ను 6.65 శాతం నుంచి 6.60 శాతం చేసింది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 6.90 శాతానికి సవరించింది.
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఇక ‘పార్క్‌వే’!
కంపెనీ, ఇతర అనుబంధ సంస్థల పేరును ‘పార్క్‌వే’గా మార్చేందుకు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ బోర్డు సూత్రప్రాయ ఆమోదం ఇచ్చింది. ప్రమోటర్ల నుంచి అనుబంధం తగ్గించుకుని, హాస్పిటల్‌ వ్యాపారానికి సంబంధం ఉండే విధంగా ఈ పేరును నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.