close

Updated : 12/04/2021 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంగారు రుణాలు - ఆస‌క్తిక‌ర విష‌యాలు

ప్ర‌స్తుతం బంగారు రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవ‌ల‌సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి.

చాలా బంగారు రుణ సంస్థ‌లు ఒక సంవ‌త్స‌రం కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు బంగారు రుణాల‌ను అందిస్తుండంగా, కొన్ని బ్యాంకులు రుణ గ్ర‌హీత‌ల‌ను కాల‌వ్య‌వ‌ధి పొడిగించ‌డానికి అనుమ‌తిస్తాయి. బంగారం రుణాల‌పై వ‌డ్డీ రేట్లు కొన్ని రుణ సంస్థ‌లు త‌క్కువ తీసుకుంటుంటే, కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాయి.

కొన్ని నెల‌లుగా బంగారు రుణాల‌కు డిమాండ్ పెరిగింది. చిన్న వ్యాపారులు కూడా త‌మ వ్యాపారాల‌లో న‌గ‌దు ప్ర‌వాహానికి ఈ రుణాలు తీసుకుంటున్నారు.

గ‌డిచిన డిసెంబ‌ర్ త్రైమాసికంలో ఫెడ‌ర‌ల్ బ్యాంక్ లో బంగారు రుణాలు 67% పెరిగాయి.

ఇటీవ‌ల నెల‌ల్లో బంగారు రుణాల మొత్తాలు స‌రిదిద్ద‌బ‌డ్డాయి. కొన్ని రుణ సంస్థ‌లు రుణ కాల‌వ్య‌వ‌ధిని మార్చారు. రుణ‌గ్ర‌హీత‌ల‌ను నెల‌వారీగా కూడా రుణ బాకీల‌ను తిరిగి చెల్లించ‌డానికి ప్రొత్స‌హిస్తున్నారు. ఉదాః ముథూట్ ఫైనాన్స్ నెల‌వారీ వ‌డ్డీ చెల్లింపు కోసం రిబేట్‌ను అందిస్తోంది.

సాధార‌ణంగా చాలా రుణ సంస్థ‌లు ఒక ఏడాది కాల‌వ్య‌వ‌ధికి బంగారు రుణాల‌ను అందిస్తున్నారు. పైసాబ‌జార్‌.కామ్ గ‌ణాంకాల ప్ర‌కారం కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్, బంధ‌న్ బ్యాంక్ వంటి కొద్ది మంది మాత్ర‌మే 3 ఏళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ కాలానికి బంగారం మీద రుణాలు ఇస్తున్నాయి. అయితే కొంత‌మంది రుణ సంస్థ‌లు రుణ‌గ్ర‌హీత‌ల కాల‌వ్య‌వ‌ధిని పొడిగించ‌డానికి అనుమ‌తిస్తున్నారు. కాల‌వ్య‌వ‌ధి రుణ గ్ర‌హీత ఎంచుకున్న రుణ ప‌థ‌కం మ‌రియు తిరిగి చెల్లించే ఎంపిక‌పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

అనేక ఇతర రుణాల మాదిరిగానే, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే ఈ బంగారు రుణాల‌ను అందిస్తున్నాయి. త‌ర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు అందించే బంగారు రుణ వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గానే ఉన్నాయి.

రుణ సంస్థ‌లు సాధార‌ణంగా 18, 22 క్యారెట్ల మ‌ధ్య ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను త‌న‌ఖాకు అంగీక‌రిస్తాయి. బ్యాంక్‌లచే కొనుగోలు చేయ‌బ‌డిన నాణేలు 50 గ్రా. నాణేలు మ‌రియు 24 క్యారెట్ల స్వ‌చ్ఛ‌త‌వి కూడా అంగీక‌రిస్తున్నాయి.

ఈ రుణాలు ఇచ్చేట‌పుడు ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రాసెస్ ఛార్జీలు, స్టాంపింగ్ ఛార్జ్‌, మూల్యాంక‌న ఛార్జ్‌లు ఉంటాయి. కొన్ని రుణ సంస్థ‌లు జ‌ఫ్తు ఛార్జీలు కూడా వ‌సూలు చేస్తారు.

ఇటీవ‌ల నెల‌ల్లో మాదిరిగా బంగారం ధ‌ర‌లు ప‌డిపోతే రుణ సంస్థ‌లు మ‌రింత సెక్యూరిటీ కోసం ఇంకా అద‌నంగా బంగారం అడ‌గ‌వ‌చ్చు. రుణ గ్ర‌హీత స‌కాలంలో న‌గ‌దును చెల్లించ‌క‌పోయిన లేదా ఎక్కువ బంగారాన్ని అందించ‌క‌పోతే, రుణ సంస్థ‌లు జ‌రిమానా వ‌సూలు చేయ‌వ‌చ్చు. మ‌రియు అనేక నోటీసుల త‌ర్వాత బంగారాన్ని అమ్మ‌డం లేదా వేలం కూడా వేయ‌వ‌చ్చు.

వివిధ రుణ సంస్థ‌లు బంగారం మీద వ‌సూలుచేసే వ‌డ్డీ రేట్లు, కాల‌వ్య‌వ‌ధి ప‌ట్టిక క్రింద ఉంది.


 

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని