ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు - Markets started on a flat note
close

Published : 17/03/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 50,436, వద్ద, నిఫ్టీ 14,946 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 80 పాయింట్లు లాభపడి 50,444 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 17 పాయింట్లు ఎగబాకి 14,928 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.55 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఇంధన, పారిశ్రామిక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో అక్కడి సూచీలు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో పయనిస్తున్నాయి.

క్యాపిటల్‌ గూడ్స్‌, మౌలిక, ఎఫ్‌ఎంసీజీ, పారిశ్రామిక రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతుండగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇంధన రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎల్‌అండ్‌టీ, గెయిల్‌ ఇండియా, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. భారత్‌ పెట్రోలియం, ఏషియన్‌ పెయింట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని