మింత్రా లోగో మారింది! - Myntra changes logo after complaint calls signage offensive to women
close

Published : 30/01/2021 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మింత్రా లోగో మారింది!

దిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ దుస్తుల విక్రయ సంస్థ మింత్రా లోగో మారింది. కంపెనీ చిహ్నం అభ్యంతరకరంగా ఉందన్న ఫిర్యాదు మేరకు లోగోలో స్వల్ప మార్పులు చేసింది. కొత్తలోగోను మింత్రా వెబ్‌సైట్‌, యాప్‌లోనూ మార్చింది. ప్యాకింగ్‌పైనా కొత్త లోగో రానుంది.

ముంబయికి చెందిన అవెస్టా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నాజ్‌ పటేల్‌.. మింత్రా లోగోపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోగోలోని (ఎం- అక్షరం) అక్షరం మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మింత్రా సానుకూలంగా స్పందించి మార్పులు చేసేందుకు అంగీకరించిందని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రష్మీ కరందికార్‌ తెలిపారు.

లోగో విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. మరికొందరు మాత్రం.. అసలు లోగోలో మార్పులు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ‘మాకూ ఈ లోగో విషయంలో అభ్యంతరం’ ఉందంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

ఇవీ చదవండి...
ఆర్‌బీఐ నుంచి క్రిప్టో కరెన్సీ.. ఈ సమావేశాల్లోనేనా?
సొంతింటి కలకు.. గడువు పెంచుతారా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని