హైదరాబాద్‌లో వాహన లీజ్‌కు భారీ ఆదరణ: ఓటీఓ క్యాపిటల్‌ - OTO Capital growing at a faster pace in Hyderabad
close

Published : 19/03/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో వాహన లీజ్‌కు భారీ ఆదరణ: ఓటీఓ క్యాపిటల్‌

తమ వినియోగదారుల సంఖ్యలో 386% వృద్ధి నమోదైనట్లు వెల్లడి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ద్విచక్రవాహనాల కొనుగోలులో లీజింగ్‌ విధానానికి భారీ ఆదరణ లభిస్తోందని ఫైనాన్స్‌ అంకుర సంస్థ ఓటీఓ టెక్నాలజీస్ వెల్లడించింది. తమ సంస్థ ద్వారా వాహనాల లీజింగ్‌ కోసం రుణం తీసుకుంటున్న వారి సంఖ్యలో 386 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. కొత్తగా మరో 45 వాహన డీలర్లు తమతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది. 2021లో కనీసం మూడు వేల మంది వినియోగదారులకు లీజింగ్‌ సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది.

హైదరాబాద్‌లో నాలుగు నెలల క్రితం తమ సేవల్ని ప్రారంభించిన ఓటీఓ.. ఇప్పటి వరకు 400కు పైగా ద్విచక్రవాహనాల లీజింగ్‌కు ఫైనాన్స్‌ అందించినట్లు తెలిపింది. సంస్థ ఆన్‌లైన్‌ వ్యాపారంలో 35 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే జరిగిందని పేర్కొంది. లాక్‌డౌన్‌ తర్వాత స్వయం ఉపాధిలో ఉన్నవారే ఎక్కువగా లీజింగ్‌ సేవల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలను లీజ్‌ తీసుకున్నవారిలో 46 శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారేనని పేర్కొంది.

స్కూటర్లు, ధర రూ.లక్ష కంటే తక్కువ ఉన్న కొత్త మోడల్‌ బైక్‌లకు ఆదరణ బాగా ఉందని ఓటీఓ తెలిపింది. బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్‌లో సేవల్ని అందిస్తున్న ఈ సంస్థ ఇప్పటి వరకు 160 మంది డీలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2020లో రూ.17 కోట్లు విలువ చేసే 2000 ద్విచక్రవాహనాల లీజింగ్‌కు ఫైనాన్స్‌ సహకారాన్ని అందించింది. ప్రతినెలా 500 మంది కొత్త వినియోగదారులు చేరుతున్నట్లు సంస్థ తెలిపింది.

ఇవీ చదవండి...

పదవీ విరమణలో తోడుగా...

భారత్‌లో ఇళ్ల ధరలు తగ్గాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని