7 నెలల కనిష్ఠానికి ‘తయారీ’ - PMI of Manufacturing Industries fell to 7 month low
close

Published : 05/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7 నెలల కనిష్ఠానికి ‘తయారీ’

దిల్లీ: దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్ఠానికి చేరాయి. మరోసారి కరోనా విజృంభిస్తుండడంతో మార్చిలో గిరాకీ క్షీణించింది. ఈ ప్రభావం ఉత్పత్తి కార్యకలాపాలపై కూడా పడినట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ నెలవారీ సర్వే వెల్లడించింది‌. ఇక ఫిబ్రవరిలో 57.5గా ఉన్న మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) గత నెల 55.4కు తగ్గింది. అయితే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు.. అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.

మార్చిలో కొత్త ఆర్డర్లు తగ్గాయని.. దీంతో తయారీ సైతం నెమ్మదించిందని ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌‌ ప్రతినిధి లిమా తెలిపారు. ఈ నేపథ్యంలో తయారీ కార్యకలాపాలతో పాటు కొనుగోళ్లు కూడా నేలచూపులు చూశాయని పేర్కొన్నారు. మరోసారి కరోనా కేసులు పెరగడమే అందుకు కారణమని వివరించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన కఠిన ఆంక్షల విధింపు నేపథ్యంలో భారత పరిశ్రమలకు ఏప్రిల్‌ నెల సవాల్‌ విసరనుందని తెలిపారు. ఇక ఉద్యోగ కల్పనపై కొవిడ్‌ ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని