ఎస్‌బీఐ నికర లాభం తగ్గింది..! - SBI Net profit slips YoY
close

Published : 04/02/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ నికర లాభం తగ్గింది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ నికర లాభం కుంగింది. గురువారం కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఫలితాలతో పోలిస్తే 6.9శాతం నికర లాభం తగ్గి రూ.5,196.22 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా మొండిబకాయిల కోసం భారీగా ప్రొవిజన్లు ఏర్పాటు చేయాల్సిరావడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. గతేడాది ఇదే సమయంలో ఎస్‌బీఐ రూ.5,583.4 కోట్ల మేరకు నికర లాభాన్ని ఆర్జించింది. 

ఈ ఏడాదితో సెప్టెంబర్‌ పోలిస్తే పన్నుచెల్లించిన తర్వాత మిగిలిన లాభం 13.6శాతం పెరుగుదల నమోదైంది. గత త్రైమాసికంలో రూ.4,574 .2 కోట్లు.  ఇక కంపెనీ డిసెంబర్‌ త్రైమాసికంలో నిర్వహణ లాభం కింద రూ.17,333.16 కోట్లను చూపింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.18,222.56 కోట్లగా ఉంది. అంటే నిర్వహణలాభాల్లో రూ.4.8శాతం తగ్గుదల నమోదైంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం కూడా 3.7శాతం పెరిగి రూ.28,820 కోట్లకు చేరింది. 

ఇవీ చదవండి
అమెజాన్‌ సీఈఓ ఆండీ జాస్సీ

‘ఇస్రో’తో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఒప్పందం

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని