Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు - Stock market ended in a flat note
close

Updated : 03/05/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం బలహీనంగా ప్రారంభమైన సూచీలు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి జారుకున్నాయి. కానీ, అవి ఎక్కువ సేపు నిలవలేదు. సెన్సెక్స్‌ ఉదయం 48,356 వద్ద బలహీనంగా ప్రారంభమై.. 48,863 వద్ద గరిష్ఠాన్ని.. 48,028 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 63 పాయింట్ల నష్టంతో 48,718 వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ చివరకు 3 పాయింట్ల స్వల్ప లాభంతో 14,634 వద్ద స్థరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద ముగిసింది. 

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు కొవిడ్‌ భయాలు నేడు మార్కెట్‌ సూచీలను ప్రభావితం చేశాయి. లాక్‌డౌన్‌ భయాలూ మదుపర్లను కలవరపెట్టాయి. పైగా ఇప్పటికే విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్లతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని.. దీంతో పునరుత్తేజం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. అయితే, కీలక రంగాల్లో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు చివర్లో పుంజుకున్నాయి. 

అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టైటన్‌ కంపెనీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని