కరోనా అనిశ్చితిలోనూ లాభాల కళ కళ! - Stock market opening bell
close

Updated : 26/04/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా అనిశ్చితిలోనూ లాభాల కళ కళ!

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఉదయం 48,197 వద్ద బలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ 48,667 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 48,152 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 508 పాయింట్ల లాభంతో 48,386 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికి వస్తే 14,449 వద్ద సానుకూలంగా ప్రారంభమై 14,557 - 14,421 మధ్య కదలాడింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 14,488 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద నిలిచింది. 

అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడటం కలిసొచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సరైన మార్గంలోనే ఉందన్న నిపుణుల అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు తెచ్చిపెట్టాయి. కొంత కాలం క్రితం వరకు కరోనాతో కొట్టుమిట్టాడిన బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ అమెరికా కంటే వేగంగా పుంజుకునే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయ సూచీల సెంటిమెంటును పెంచాయి. మరోవైపు దేశంలో కరోనా కల్లోలాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా చర్యలు చేపడుతుండడం మదుపర్లలో విశ్వాసం నింపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడాయి. కొవిడ్‌ భయాలు వెంటాడినప్పటికీ.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు.. ఆర్థిక వ్యవస్థపై ఆంక్షల ప్రభావం పెద్దగా ఉండబోదన్న భరోసా మదుపర్లను ముందుకు నడిపించాయి. 

యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. సిప్లా, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారత్‌ పెట్రోలియం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని