బంగారంపై ప‌న్ను ఎంత ? ఎలా దాఖ‌లు చేయాలి? - Taxability-of-gold-and-gold-derivatives
close

Updated : 25/12/2020 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారంపై ప‌న్ను ఎంత ? ఎలా దాఖ‌లు చేయాలి?

ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం బంగారం పెట్టుబ‌డులు, ఆదాయంపై వివిధ‌ రకాలుగా ప‌న్నులు వ‌ర్తిస్తాయి.. బంగారం అనేది ఒక ఖ‌రీదైన లోహం. రోజురోజుకి దీనికి డిమాండ్ పెరుగుతూనే వ‌స్తుంది కానీ త‌గ్గ‌ట్లేదు. బంగారంపై పెట్టుబ‌డులు కూడా కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే ఒక‌ప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో దాచుకునేవారు, ఇప్పుడు బాండ్లు, ఈటీఎఫ్‌ల రూపంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ పసిడికి ఉన్న‌విలువ‌ మాత్రం పెరుగుతూనే వ‌స్తుంది. మ‌రి ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు బంగారం పెట్టుబ‌డుల‌కు ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుందో తెలుసుకుందాం.

భౌతిక రూపంలో బంగారం
బంగారం ఆభ‌ర‌ణాలు, నాణేలు, బిస్క‌ట్లు ఇలా వివిధ రూపాల్లో ఉంటుంది. ఆదాయ ప‌న్నురిట‌ర్నుల స‌మ‌యంలో దీనిని మూల‌ధ‌న‌ ఆస్తిగా ప‌రిగ‌ణిస్తారు. బంగారం విక్ర‌యించిన‌ప్పుడు వ‌చ్చిన లాభంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే బ‌హామ‌తి రూపంలో ఇచ్చినా, వార‌స‌త్వంగా వ‌చ్చిన దానిపై ప‌న్ను ఉండ‌దు.

ప‌న్ను ఎంత కాలానికి, ఏ విధంగా ఉంటుంది?

బంగారం వ్యాపార‌స్తుల‌కు దీనిని ఆదాయ ప‌న్ను కింద లెక్కిస్తారు, వారి ద‌గ్గ‌ర ఉన్న ప‌స‌డి ప‌న్ను ప‌రిధిలోకి రాదు. ఏ రూపంలో అయినా రూ.50 కంటే ఎక్కువ విలువ ఉన్న బంగారం పొందిన‌ట్ల‌యితే ఉంటే దానిపై ప‌న్ను ప‌డుతుంది. దానిని ఇత‌ర మార్గాల నుంచి వ‌చ్చే ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. వివాహం వంటి శుభ‌కార్యాల‌ల‌లో బ‌హుమ‌తి రూపంల‌లో బంగారం తీసుకుంటే ప‌న్ను ఉండ‌దు.

గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్‌)
గోల్డ్ ఈటీఎఫ్‌ల‌లో పెట్టుబ‌డుదారుల నుంచి బంగారం విలువ‌తో డ‌బ్బును సేక‌రించి ట్రేడింగ్ జరుపుతారు. గోల్ట్ ఈటీఎఫ్‌లో పెట్టుబ‌డి చేస్తే బంగారం మ‌న దగ్గ‌ర లేక‌పోయినా వాటిని విక్ర‌యించిన‌పుడు బంగారం విలువ ల‌భిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ మార్కెట్లో ట్రేడ‌వుతాయి. ఇవి కాగిత రూపంలోనూ ఉంటాయి. డిజిట‌ల్ ప‌ద్ధతిలో కూడా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల యూనిట్ల‌ను డెట్ ఫండ్లుగా పరిగ‌ణిస్తారు. బంగారంపై ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుందో వీటికీ అంతే ఉంటుంది.

గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్
గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్ -2015 లో భాగంగా ప్ర‌భుత్వం పెట్టుబ‌డుదారుల‌కు కొత్త ఆప్ష‌న్ల‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా వారు డిపాజిట్ చేసిన ఇష్టం వ‌చ్చినప్పుడు బంగారం రూపాన్ని మార్చుకోవ‌చ్చు. త‌ర్వాత బ్యాంకు వారి పేరుతో గోల్డ్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించి త‌గినంత బంగారాన్ని ఖాతాలో వేస్తుంది.

గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్‌-2015 కింద జారీ చేసిన స‌ర్టిఫికెట్లను మూలధ‌న ఆస్తిగా చూడ‌రు. దీనిపై వ‌చ్చిన ఆదాయంపై కూడా సెక్ష‌న్ 10(15) ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు
దేశంలో ఫిజిక‌ల్ గోల్డ్ కి ఉన్న డిమాండ్‌ను, విదేశాల నుంచి దిగుమ‌తుల‌ను త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్‌లో బంగారానికి ఉన్న‌ విలువ మాదిరిగానే బాండ్ల విలువ ఉంటుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం, ఈ బాండ్ల‌పై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే బాండ్ల గ‌డువు ముగియ‌క‌ముందే ఉప‌సంహ‌రించుకుంటే ప‌న్ను ఉండ‌దు. అయితే బాండ్ల‌ను ఒక‌రి నుంచి మ‌రొక‌రికి బ‌దిలీ చేసుకుంటే మాత్రం ప‌న్ను ఉంటుంది.

బంగారానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని