TiE Sustainability Summit: 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు అవకాశం - There is scope for 100 million dollar investments
close

Published : 26/09/2021 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TiE Sustainability Summit: 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు అవకాశం

సామాజిక సంస్థలకు వేదికగా ‘టై సస్టెయినబులిటీ సమ్మిట్‌’ 

వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకూ నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: టై (ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) హైదరాబాద్‌ వచ్చే నెలలో దృశ్య మాధ్యమంలో నిర్వహించే ‘టై సస్టెయినబులిటీ సమ్మిట్‌’ ద్వారా సామాజిక సంస్థలకు (సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌) దాదాపు 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం వ్యాపారమే లక్ష్యంగా కాకుండా ఎంతో కొంత సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా ముందుకు సాగే వ్యాపార సంస్థలను సామాజిక సంస్థలుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి రోజు వారీ అవసరాలకు అనువైన వస్తువులు ఉత్పత్తి చేయటం నుంచి పర్యావరణ పరిరక్షణ, విద్య, ఉపాధి, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఆరోగ్య సేవలు... తదితర వివిధ ప్రజానుకూలమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఈ తరహా సంస్థల స్థితిగతులు, వృద్ధి, పెట్టుబడి అవకాశాలు, సంబంధిత ఇతర అంశాలు ఈ సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకూ జరిగే ఈ  ‘టై సస్టెయినబులిటీ సమ్మిట్‌’ లో 200 మంది ప్రపంచ వ్యాప్త పెట్టుబడిదార్లు పాల్గొని, 50 నుంచి 100 వరకూ సామాజిక సంస్థలను ఎంపిక చేసుకొని పెట్టుబడులు పెడతారని భావిస్తున్నారు. సామాజిక సంస్థలను, సమాజంలో పరివర్తన తెచ్చే దిక్సూచీలని, అటువంటి వాటికి ఒక వేదికగా ఈ సదస్సు ఉండబోతోందని టై హైదరాబాద్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సామాజిక సంస్థల నుంచి సమీప భవిష్యత్తులో ఎన్నో ‘యూనికార్న్‌’లు వస్తాయని, ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే శక్తి వీటికి ఉందని టై గ్లోబల్‌ మాజీ ఛైర్మన్, రాజస్థాన్‌ ఏంజెల్‌ సహ-వ్యవస్థాపకుడు మహావీర్‌ శర్మ వివరించారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని