ఐటీఆర్‌ ఫైల్ చేసేందుకు ఈ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి - What-documents-are-required-to-file-Income-tax-returns
close

Updated : 01/01/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీఆర్‌ ఫైల్ చేసేందుకు ఈ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి

స‌రైన ఐటీఆర్ ఫార‌మ్‌ను ఎంచుకుని రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే మీ రిట‌ర్నులు తిర‌స్క‌ర‌ణ‌కు గురవుతాయి. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఐటీఆర్‌ ఫార‌మ్‌ల‌ను ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచింది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేదీ జులై31,2019. అందువ‌ల్ల రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేందుకు కావ‌ల‌సిన ప‌త్రాల‌ను సిద్దం చేసుకోవాలి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ ద్వారా రిట‌ర్నులు ఫైల్ చేస్తున్నారా? అయితే ఇందు కోసం ఉద్యోగులు ఈ కింది 7 డ్యాకుమెంట్లు సేక‌రించి పెట్టుకోవాలి.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేందుకు కావ‌ల‌సిన ప‌త్రాలు..

ఫార‌మ్ 16: శాల‌రీ ఆదాయం క‌లిగిన వారు రిట‌ర్నులు ఫైల్ చేసేందుకు త‌ప్ప‌నిస‌రిగా కావ‌ల‌సిన ప‌త్రాల‌లో ఫారం16 ఒక‌టి. ఈ ఫార‌మ్ 16 ను సంస్థ య‌జ‌మాని జారీ చేస్తారు. ఇందులో ఉద్యోగి జీతం, అల‌వెన్సుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెల‌పాల్సి ఉంటుంది. శాల‌రీ నుంచి డిడ‌క్ట్ చేసిన మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌) స‌మాచారం కూడా ఇందులో ఉంటుంది.
ఫార‌మ్ 16లో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ.
పార్ట్‌-ఏలో ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో సంస్థ నుంచి డిడ‌క్ట్ అయిన ప‌న్ను స‌మాచారం తెలుస్తుంది. ఇందులో సంస్థ‌ పాన్‌, టాన్ వివిరాలు కూడా ఉంటాయి. ఇక పార్ట్ బీలో ఉద్యోగి స్థూల వేత‌నం, అల‌వెన్సులు వంటి వివ‌రాలు ఉంటాయి. మీ సంస్థ నుంచి ఫార‌మ్ 16ను పొందిన త‌రువాత‌, ఫార‌మ్‌లో పొందుప‌రిచిన వేత‌నం, అల‌వెన్సు, పాన్ నెంబ‌రు స‌రైన విధంగా ఉన్న‌యో లేదో త‌న‌ఖీ చేసుకోవాలి. ఏమైన వ్య‌త్యాసం ఉంటే మీ సంస్థను సంప్ర‌దించాలి.

బ్యాంకు, ఫోస్టాఫీసుల నుంచి పొందే వ‌డ్డీ స‌ర్టిఫికేట్‌: ఐటీఆర్‌ను ఫైల్ చేసేందుకు మ‌రొక ముఖ్య‌మైన ప‌త్రం వ‌డ్డీ స‌ర్టిఫికేట్‌. ఈ సంవ‌త్స‌రం ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు, పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌, ఇత‌ర పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని , ఆదాయ మార్గాన్ని తెలియ‌జేయాలి.

బ్యాంక్‌, పోస్టాఫీసుల పొదుపు ఖాతాల వ‌డ్డీపై సెక్ష‌న్ 80టీటీఏ కింద ఒక వ్య‌క్తి ఈ సంవ‌త్స‌రం రూ.10 వేల వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్లు అయితే రూ.50 వేల వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం బ్యాంకు వ‌ద్ద నుంచి వ‌డ్డీ స‌ర్టిఫికేట్ తీసుకోవాలి. ప్ర‌త్యామ్నాయంగా మీ పాస్‌బుక్ ఎంట్రీల‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.

ఫారం 26ఏఎస్‌: ఫారం 26 ఏఎస్ ఐటీఆర్ ఫైల్లింగ్‌లో మ‌రొక ముఖ్య‌మైన డాక్యుమెంట్‌, ఇది ఆన్‌లైన్ ట్యాక్స్ స్టేట్‌మెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కింది స‌మాచారాన్ని క‌లిగి ఉంటుంది.

  మీ సంస్థ డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ వివ‌రాలు
♦ బ్యాంకులు డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ వివరాలు
♦ మీరు చేసిన చెల్లింపుల‌కు గానూ ఇత‌ర సంస్థ‌లు డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ వివరాలు
♦ ఆర్థిక సంవ‌త్స‌రం 2018-19 గానూ మీరు జ‌మ చేసిన ముంద‌స్తు ప‌న్నులు
♦ స్వీయ అంచనా ప‌న్ను చెల్లింపులు వంటి స‌మాచారం ఉంటుంది.
26ఏఎస్ ఫారమ్‌ను
www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లోకి లాగ్ఇన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ వెబ్సైట్‌కి లాగ్ఇన్ అయ్యి “View 26AS” లో “My Account” టాబ్‌ని క్లిక్ చేయాలి.
ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఆధారాలు: ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు వివిధ ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు చేయాల్సి ఉంటుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, ప‌న్ను ఆదా ఫిక్సెడ్ డిపాజిట్‌, ఈఎల్ఎస్ఎస్‌, జీవిత బీమా ప్రీమియం, జాతీయ ఫించ‌ను ప‌థ‌కం చెల్లింపులు వంటివి సాదార‌ణంగా పెట్టుబ‌డి పెట్టే ప‌న్ను ఆదా ప‌థ‌కాలు. ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసేందుకు ఈ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు చేసిన‌ట్లు ఆధారాలు ఉండాలి. అయితే రిట‌ర్నులు ఫైల్ చేసేప్పుడు సంబంధిత డాక్యుమెంట్ల‌ను ఇవ్వాల‌ని ఐటీ శాఖ కోర‌దు. వీటికి సంబంధించిన ఆధారాల‌ను మీ వ‌ద్ద భ‌ద్ర‌ప‌రుచుకుని ఐటీ శాఖ అడిగిన‌ప్పుడు చూపించాలి. సాధార‌ణంగా ఉద్యోగులు అన్ని ప‌త్రాల‌ను టీడీఎస్ డిడ‌క్ష‌న్ కోసం వారు ప‌నిచేసే సంస్థ‌ల‌కు ఇవ్వాలి.

సెక్ష‌న్ 80డీ కింద మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు కావ‌ల‌సిన‌ డాక్యుమెంట్లు : సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు ప‌త్రాల రూపంలో ఆధారాల‌ను చూపించాల్సి ఉంటుంది. మీ, మీ కుంటుంబ ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు సంబంధించి సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఆరోగ్య‌బీమా ప్రీమియం చెల్లింపుల‌పై ఒక వ్య‌క్తి గరిష్టంగా రూ.25 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఒక‌వేళ మీరు సీనియ‌ర్ సిటిజ‌న్ కోసం ప్రీమియం చెల్లిస్తుంటే రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. పైన చెప్పిన విధంగా వీటికి సంబంధించిన ప్రూఫ్‌ల‌ను మీ వ‌ద్దే భద్ర‌ప‌రచుకోవాలి. ఐటీ శాఖ కోరిన‌ప్పుడు చూపించాలి.

బ్యాంకు నుంచి గృహ రుణ స్టేట్‌మెంట్‌: మీరు బ్యాంకు లేదా ఇత‌ర ఆర్థిక సంస్థ నుంచి గృహ రుణం పొందిన‌ట్ల‌యితే, ఐటీఆర్ ఫైల్లింగ్ కోసం గ‌త ఆర్థిక సంవ‌త్స‌ర గృహ రుణ స్టేట్‌మెంటును తీసుకోవాలి. ఈ స్టేట్‌మెంట్‌లో మీరు తీసుకున్న రుణం మొత్తం, గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి మీరు చెల్లించిన వ‌డ్డీకి సంబంధించి మొత్తం వివ‌రాలు ఉంటాయి. ఈ వివ‌రాల‌ను ఐటీ రిట‌ర్నుల‌లో తెల‌పాల్సి ఉంటుంది.

క్యాపిట‌ల్ గెయిన్ స్టేట్‌మెంట్‌: ఆదాయ‌పు రిట‌ర్నులు ఫైల్ చేసేందుకు క్యాపిట‌ల్ గెయిన్ స్టేట్‌మెంట్ అవ‌స‌రం. ఆస్తిని లేదా గ‌త సంవ‌త్స‌రానికి సంబంధించి మ్యూచువ‌ల్ ఫండ్లు లేదా షేర్ల‌ను విక్ర‌యించిన‌ప్పుడు వ‌చ్చే మూల‌ధ‌న రాబ‌డిని ఐటీ రిట‌ర్నుల‌లో వివ‌రంగా తెలియ‌జేయాలి. ఒక‌వేళ ఆస్తిని విక్రయించిన‌ప్పుడు రాబ‌డి వ‌స్తే మాన్యువ‌ల్గా లెక్కించాలి. మ్యూచువ‌ల్‌ఫండ్లు, ఈక్వీటీల‌ను విక్ర‌యించిన‌ప్పుడు క్యాపిట‌ల్ గెయిన్ స్టేట్‌మెంట్ తీసుకోవాలి.

ఐటీ రిట‌ర్నుల‌ను ఫైల్ చేసే ముందు గుర్తించుకోవాల్సిన విష‌యాలు

మీకు త‌గిన ఐటీర్ ఫార‌మ్‌ను జాగ్ర‌త్త‌గా ఎంపిక చేసుకోవాలి. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు వివిధ ర‌కాల ఫార‌మ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో స‌రైన ఫార‌మ్‌ను ఎంచుకోక‌పోతే మీ రిట‌ర్నులు తిర‌స్క‌ర‌ణ‌కు గురవుతాయి.
► పాన్‌కార్డు, ఈమెయిల్ ఐటీ, బ్యాంకు ఖాతా నెంబ‌రు, బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ గురించి ఖ‌చ్చిత‌మైన స‌మాచారాన్ని ఐటీఆర్ ఫార‌మ్‌ల‌లో నింపాలి
► బ్యాంకు పొదుపు ఖాతాపై వ‌చ్చే వ‌డ్డీ, ఇత‌ర పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని ఐటీఆర్ ఫార‌మ్‌లో ఖ‌చ్చితంగా తెల‌పాలి.
► రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేముందు ఫార‌మ్ 26ఏఎస్ త‌నిఖీ చేసుకోండి. ఒక‌వేళ ఫార‌మ్ 26ఏఎస్‌లోని వివ‌రాల‌తో ఐటీఆర్ వివ‌రాలు స‌రిపోక‌పోతే ఐటీ రిట‌ర్నుల‌ను తిర‌స్క‌రిస్తారు.
► క్యాపిట‌ల్ గెయిన్స్ గురించి పూర్తి స‌మాచారం ఇవ్వాలి. మీ స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను చెల్లించాలి.
► రెండ‌వ ఇంటిని గురించి పూర్తి స‌మాచారం ఇవ్వాలి. ఇత‌ర ఆస్తుల‌ను గురించి స‌మాచారం ఇవ్వ‌క‌పోతే భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని