సెకండ్ హ్యాండ్‌ కారు కొనేందుకు బ్యాంకులు రుణాలిస్తాయా? - are planning to take a used car loan
close

Updated : 21/06/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెకండ్ హ్యాండ్‌ కారు కొనేందుకు బ్యాంకులు రుణాలిస్తాయా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కారు కొన‌డం చాలా మంది కల. దాన్ని సాకారం చేసుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టాల్సి వస్తుంది. దీనికి స‌రైన ప్ర‌ణాళిక అవ‌స‌రం. అందుకే కొందరు.. కారు కొనుగోలు ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి సెకండ్ హ్యాండ్‌వైపు మొగ్గు చూపుతారు. ఇదో విధంగా తెలివైన పనే. ఎందుకంటే నచ్చిన కారును తక్కువ మొత్తానికే సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలుకూ బ్యాంకులు రుణాలిస్తాయనే విషయం తెలీదు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయి. అవేంటో, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త కార్ల కొనుగోలుకు రుణాలిచ్చినట్లే వీటి కొనుగోలుకు కూడా బ్యాంకులు రుణాలిస్తాయి. కాకపోతే కాస్త ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని నిబంధనలూ ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని రుణ సంస్థ‌లు ఈ రుణాల‌ను తయారైన 3 ఏళ్లలోపు ఉన్న కార్లకు మాత్రమే రుణాలిస్తాయి. మరికొన్ని 5 ఏళ్ల వరకు అందిస్తున్నాయి. అలాగే, చాలా రుణ సంస్థ‌లు కారు విలువ‌లోని 60శాతం వ‌ర‌కు మాత్ర‌మే రుణంగా అందిస్తాయి. మిగిలిన మొత్తాన్ని కారు కొంటున్న‌వారే సొంతంగా భ‌రించాలి. రుణం ఇచ్చేట‌ప్పుడు కూడా ఆయా వ్య‌క్తుల క్రెడిట్ స్కోర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 వరకు బ్యాంకులు ఈ తరహా రుణాలు అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు 7.3 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కింది పట్టికలో ఐదేళ్ల కాలానికి రూ.10 లక్షల రుణానికి ఈఎంఐ ఎంత ఉంటుందో ఇస్తున్నాం. తక్కువ వడ్డీ అందిస్తున్న బ్యాంకుల జాబితాను మాత్రమే ఇక్కడ అందిస్తున్నాం.

నోట్‌: ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజు, మ‌రే ఇత‌ర ఛార్జీల‌ను ఇక్క‌డ చేర్చ‌లేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని