మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు! - commercial gas cylinder prices hiked by oil companies
close

Updated : 01/03/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!


దిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరోసారి షాకిచ్చాయి. వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పైనా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని సోమవారం వెల్లడించాయి.

మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ బండపై రూ. 225 పెరగడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా... ఫిబ్రవరి 4న ఇది రూ.719కి చేరింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న మరో రూ. 50 పెంచడంతో రూ. 769కి పెరిగింది. ఆ తర్వాత ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంట గ్యాస్‌పై రూ.25 వడ్డన విధించారు. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర రూ.819కి చేరడం గమనార్హం.

వాణిజ్య సిలిండర్‌పైనా రూ.95 పెరగడంతో.. ఒక సిలిండర్‌ ధర రూ.1,614కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో 16 రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం గమనార్హం. 

ఇవీ చదవండి..

టీకా తీసుకున్న భారత ప్రధాని మోదీ

మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ అజాద్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని