త్వరలో క్రిప్టోకరెన్సీపై బిల్లు - crypto bill being finalised will be sent to cabinet soon: govt
close

Published : 09/02/2021 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో క్రిప్టోకరెన్సీపై బిల్లు

రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి

దిల్లీ: త్వరలోనే క్రిప్టోకరెన్సీపై బిల్లును కేబినెట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. క్రిప్టో కరెన్సీ బిల్లు చివరి దశలో ఉందని ఆయన వెల్లడించారు. ‘‘భారత్‌లో క్రిప్టో కరెన్సీ వినియోగంపై ఆర్బీఐ త్వరలో విధివిధానాలు త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. కానీ అది సమస్యాత్మకమైన అంశం. క్రిప్టోకరెన్సీని భారత్‌లో నిలువరించేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఏదైనా బిల్లును పెట్టే ప్రతిపాదన ఉందా?.’’ అని కర్ణాటక భాజపా ఎంపీ కేసీ రామమూర్తి అడిగారు. దీనికి ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ సమాధానమిచ్చారు. ‘‘ఆర్బీఐ, సెబీలకు క్రిప్టోకరెన్సీని  నేరుగా నియంత్రించేందుకు లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ లేదు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ఆస్తులు, వస్తువు కాదు. ప్రస్తుతమున్న చట్టాల్లో దీనికి సంబంధించిన అంశాలు లేవు. అందుకే గతంలో దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించాం. దీనిపై బిల్లు చివరిదశలో ఉంది. త్వరలో కేబినెట్‌ ముందుకు తెస్తాం.’’ అని మంత్రి తెలిపారు.

దేశంలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడంపై విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని భారతీయ రిజర్వు బ్యాంకు గతంలో వెల్లడించింది. దేశంలో క్రమంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ పెరుగుతుండటంతో, వీటి వల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇవీ చదవండి..

భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ

ఉద్యమ కేంద్రంలోనే ఉపద్రవం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని