RBI: క్రిప్టో సంబంధాలపై పునరాలోచన 
close

Updated : 14/05/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RBI: క్రిప్టో సంబంధాలపై పునరాలోచన 

బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన!

దిల్లీ: క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు కొనసాగించే విషయంలో పునరాలోచన చేయాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచన చేసినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించే దిశగా భారత్‌ చట్టాలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇలాంటి మార్గదర్శకాలు ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు అనధికారికంగా వచ్చాయని సమాచారం. క్రిప్టోకరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పనిచేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు రద్దు చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఆర్‌బీఐ అనధికారికంగా చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ఆర్‌బీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇప్పటికే క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలు ఆపేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నప్పటికీ.. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా ఎలాంటి సం్పదన రాలేదు. యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు కూడా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలను పరిమితం చేసుకునే దిశగా యోచన చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
45,700 డాలర్లకు బిట్‌కాయిన్‌
టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ చేసిన ఒక్క ట్వీట్‌తో బిట్‌కాయిన్‌ విలువ 17% పడిపోయి 50,000 డాలర్ల దిగువకు చేరింది. కంపెనీ వాహనాలు కొనుగోలు చేయడానికి బిట్‌కాయిన్‌లను ఇక అనుమతించబోమని గురువారం ఉదయం ఎలాన్‌మస్క్‌ ట్వీట్‌ చేయడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ విలువ 54,819 డాలర్ల నుంచి 45,700 డాలర్లకు తగ్గింది. మార్చి 1 తర్వాత బిట్‌కాయిన్‌కు ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఎలాన్‌మస్క్‌ ట్వీట్‌ చేసిన రెండు గంటల్లోపే ఈ స్థాయికి అది పడిపోయింది. ‘బిట్‌కాయిన్‌ లావాదేవీల కోసం శిలాజ ఇంధనాలను ముఖ్యంగా అత్యంత ఎక్కువగా ఉద్గారాలను వెలువరచే బొగ్గును వాడడంపై ఆందోళన చెందుతున్నామ’ని మస్క్‌ ట్వీట్‌ చేశారు. చాలా అంశాల్లో క్రిప్టోకరెన్సీ అనేది మంచి ఆలోచనే అయితే పర్యావరణానికి ముప్పుగా మారడమనేది మంచిది కాదని వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో తమ కార్లు కొనుగోలు చేసేవారు బిట్‌కాయిన్‌లలో చెల్లించవచ్చని పేర్కొనడంతో పాటు, 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులతో బిట్‌కాయిన్‌లను టెస్లా కొనుగోలు చేసింది. ఫలితంగా ఆ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడంలో వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే.  


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని