సాగర్‌సాఫ్ట్‌ చేతికి ఐటీ క్యాట్స్‌ ఎల్‌ఎల్‌సీ
close

Published : 15/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌సాఫ్ట్‌ చేతికి ఐటీ క్యాట్స్‌ ఎల్‌ఎల్‌సీ

నూరు శాతం వాటా కొనుగోలుకు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల సంస్థ సాగర్‌సాఫ్ట్‌ ఇండియా, అమెరికాకు చెందిన ఐటీ క్యాట్స్‌ ఎల్‌ఎల్‌సీ. అనే ఐటీ సంస్థను కొనుగోలు చేయనుంది. దీనికి శుక్రవారం సాగర్‌సాఫ్ట్‌ ఇండియా బోర్డు డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ప్రమోటర్లు, నాన్‌-ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లు జారీ చేయాలని కూడా సాగర్‌సాఫ్ట్‌ ఇండియా నిర్ణయించింది.
25 శాతం డివిడెండ్‌: వాటాదార్లకు 25 శాతం చొప్పున (ఒక్కో షేరుకు రూ.2.50) డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సాగర్‌సాఫ్ట్‌ ఇండియా రూ.11.20 కోట్ల ఆదాయాన్ని, రూ.1.40 కోట్ల నికరలాభాన్ని, రూ.2.73 ఈపీఎస్‌ను నమోదు చేసింది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.9.36 కోట్లు, నికరలాభం రూ.47.82 లక్షలు, ఈపీఎస్‌ రూ.0.75 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయం రూ.41.86 కోట్లు, నికరలాభం రూ.5.35 కోట్లు ఉన్నాయి. వార్షిక ఈపీఎస్‌ రూ.9.83 నమోదైంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని