డిప్యూటీ ఎండీలుగా 8 మందికి పదోన్నతి: ఎస్‌బీఐ
close

Published : 15/05/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిప్యూటీ ఎండీలుగా 8 మందికి పదోన్నతి: ఎస్‌బీఐ

ముంబయి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 8 మంది అధికారులకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా, 22 మందిని చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా పదోన్నతులు కల్పించింది. కొత్త డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన మహేశ్‌ కుమార్‌ శర్మ, సంజయ్‌ డి.నాయక్‌, సుబ్రతా బిశ్వాస్‌, రామనాథన్‌ విశ్వనాథన్‌, అమర రామమోహన్‌ రావు, పొలుదాసు కిశోర్‌ కుమార్‌, ఓం ప్రకాశ్‌ మిశ్రా, బాలకృష్ణ రాఘవేంద్రరావు శుక్రవారం నూతన బాధ్యతలు చేపట్టారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్న ఓమ్‌ ప్రకాశ్‌ మిశ్రా ఇప్పుడు డిప్యూటీ ఎండీ అయ్యారు. హైదరాబాద్‌ సర్కిల్‌ జనరల్‌ మేనేజరుగా ఉన్న అజయ్‌కుమార్‌ సింగ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అయ్యారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని