లారస్‌ ల్యాబ్స్‌కు రూ.241 కోట్ల లాభం
close

Published : 30/07/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లారస్‌ ల్యాబ్స్‌కు రూ.241 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌:  ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రీడియంట్స్‌), ఫార్ములేషన్ల ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థ అయిన లారస్‌ ల్యాబ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.241 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, కేటాయింపుల కంటే ముందు లాభం) రూ.400 కోట్లు ఉంది. త్రైమాసిక నికర ఆదాయం రూ.1279 కోట్లు, ఈపీఎస్‌ రూ.4.5 నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయం రూ.974 కోట్లు, నికరలాభం రూ.172 కోట్లు, ఈపీఎస్‌ రూ.3.21 ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే ప్రస్తుత మొదటి త్రైమాసికంలో ఆదాయం 31 శాతం, నికరలాభం 40 శాతం పెరిగినట్లు అవుతోంది. క్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో లారస్‌ ల్యాబ్‌్్స ఆదాయం రూ.1412 కోట్లు, నికరలాభం రూ.292 కోట్లు ఉన్నాయి.

30 శాతానికి పైగా ‘ఎబిటా’ సాధిస్తాం

ఈ సందర్భంగా లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ చావ, ‘ఈనాడు’తో మాట్లాడుతూ మెరుగైన ఆదాయాలు, లాభాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ‘ఎబిటా’ 30 శాతానికి పైగా ఉంటుందని గతంలో పేర్కొనగా, జూన్‌ త్రైమాసికంలో 31 శాతం నమోదు చేసినట్లు వివరించారు. ఆదాయాల్లోనూ అంచనాలకు తగ్గట్లు వృద్ధి కనిపించిందని అన్నారు. ‘సింథసిస్‌’ వ్యాపారంలో క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చితే 95 శాతం వృద్ది సాధించినట్లు చెప్పారు. ఏపీఐ ఔషధాల విభాగంలో ఆంకాలజీ, ఏఆర్వీ ఏపీఐ అమ్మకాలు పెరిగినట్లు వెల్లడించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చేపట్టిన మూలధన వ్యయ ప్రణాళిక అనుకున్నట్లుగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రూ.1,500-1,700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలనేది కంపెనీ ప్రణాళిక. ప్రస్తుతం 41 శాతం ఆదాయం ఫార్ములేషన్ల నుంచి లభిస్తుండగా, 2- 3 ఏళ్లలో ఇది 50 శాతం అయ్యే అవకాశం ఉందని అన్నారు. కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత తగ్గినా తమపై ప్రభావం లేదని, తాము ప్రధానంగా నాన్‌- కొవిడ్‌ ఔషధాల విభాగంలో ఉన్నట్లు వివరించారు.

వచ్చే త్రైమాసికం నుంచి లారస్‌ బయో ఆదాయాల్లో వృద్ధి:  అనుబంధ సంస్థ అయిన లారస్‌ బయో వచ్చే త్రైమాసికం నుంచి మెరుగైన ఆదాయాలు నమోదు చేస్తుందని డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ‘‘ఈ సంస్థ చేపట్టిన విస్తరణ యాభై శాతం పూర్తయింది’’ అని చెప్పారు. దీనివల్ల ఫెర్మెంటేషన్‌ ఔషధాల ఉత్పత్తి సామర్థ్యం పెరిగినందున రీ-కాంబినెంట్‌ ఫుడ్‌ ప్రొటీన్లు ఉత్పత్తి చేయగలమని వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని