జొమాటో నుంచి సహ వ్యవస్థాపకుడు నిష్క్రమణ
close

Published : 15/09/2021 04:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జొమాటో నుంచి సహ వ్యవస్థాపకుడు నిష్క్రమణ

ఐపీఓలో కీలక వ్యక్తి ఈయన

దిల్లీ: జొమాటో నుంచి ఒక కీలక వ్యక్తి నిష్క్రమించారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సంస్థ ఐపీఓలో కీలక పాత్ర పోషించిన గౌరవ్‌ గుప్తా రాజీనామా చేశారు. ‘నా జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నా. కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నా. జొమాటోలో ఆరేళ్ల పాటు పనిచేశా. ఇపుడు జొమాటోను ముందుకు తీసుకెళ్లడానికి అద్భుత బృందం ఉంది. నేను ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడానికి ఇదే సరైన సమయ’మని సిబ్బందికి రాసిన ఇమెయిల్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనను భాగస్వామి చేసిన వ్యవస్థాపకుడు, సీఈఓ దీపేందర్‌ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు స్పందిస్తూ ‘కొన్నేళ్లుగా జొమాటో విజయాల్లో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. మీరు లేకుండా కంపెనీలో నేను గడిపే రోజులను ఊహించుకోలేకపోతున్నా’ అని దీపేందర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని