దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక లక్ష్యం అభినందనీయం
close

Published : 24/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక లక్ష్యం అభినందనీయం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: 2025 నాటికి 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విశిష్ట అవకాశాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు, శక్తిసామర్థ్యాలతో దక్షిణాది రాష్ట్రాలు ఈ లక్ష్యాన్ని చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన గురువారం ‘సీఐఐ  మిస్టిక్‌ సౌత్‌: గ్లోబల్‌ లింకేజెస్‌’ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ‘భారతదేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఇదే సరైన సమయం. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల’ని పిలుపునిచ్చారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో పరిశ్రమలు కీలక భాగస్వామ్యం పోషించాలి. తయారీ, డిజిటలీకరణ, ఆటోమేషన్‌, పట్టణీకరణతోపాటు వ్యవసాయం, వైద్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. దేశంలో ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ద్వితీయశ్రేణి పట్టణాలకూ చక్కటి అనుసంధానత ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాల’ని సూచించారు. దేశంలో 55% మంది వ్యవసాయరంగంపై ఆధారపడినందున, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరంపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, అధ్యక్షుడు టీవీ నరేంద్రన్‌, సీఐఐ దక్షిణాది ఛైర్మన్‌ సీకే రంగనాథన్‌, మిస్టిక్‌సౌత్‌ ఛైర్మన్‌ టీటీ అశోక్‌, భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల, పారిశ్రామికరంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని