నాలుగో త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఐపీఓ
close

Published : 26/09/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగో త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఐపీఓ

ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. దీన్ని సాధించాలంటే ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియాలో వాటాల విక్రయాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తోంది. ‘‘ఎయిర్‌ ఇండియాను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ విక్రయంతో పాటు ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తి కావచ్చు’ అని కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ శనివారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ‘పీజీపీమ్యాక్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ 2021’ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు ఎంతో ముఖ్యమైన ఈ సంవత్సరం చరిత్రలో నిలిచిపోతుంది- అన్నారాయన. ఎంతో కీలకమైన రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను మినహాయించి, మిగిలిన అన్ని రకాలైన ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించటం ద్వారా ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని