నెస్లే ఇండియా లాభం రూ.617 కోట్లు
close

Updated : 20/10/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెస్లే ఇండియా లాభం రూ.617 కోట్లు

రెండో మధ్యంతర డివిడెండ్‌ రూ.110

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఇండియా సెప్టెంబరు త్రైమాసికానికి రూ.617.37 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.587.09 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 5.15 శాతం ఎక్కువ. ఇదే సమయంలో నికర విక్రయాలు రూ.3,525.41 కోట్ల నుంచి 9.63 శాతం పెరిగి రూ.3,864.97 కోట్లకు చేరాయి. దేశీయ అమ్మకాలు రూ.3,350.10 కోట్ల నుంచి 10.07 శాతం వృద్ధితో రూ.3,687.37 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం వ్యయాలు రూ.2,789.67 కోట్ల నుంచి 10.48 శాతం అధికమై రూ.3,081.99 కోట్లు నమోదయ్యాయి. ఎగుమతులు రూ.175.31 కోట్ల నుంచి 1.30 శాతం పెరిగి రూ.177.60 కోట్లకు చేరాయి. అన్ని విభాగాల్లో మంచి అమ్మకాలు నమోదు చేశామని నెస్లే ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌-19 రెండో దశ ప్రభావంతో జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు మందగించినా, సెప్టెంబరు త్రైమాసికంలో వ్యవస్థీకృత వ్యాపారం పుంజుకుందని అన్నారు. ఇ-కామర్స్‌ విభాగమూ బాగా రాణిస్తోందని తెలిపారు.  రెండో మధ్యంతర డివిడెండుగా కంపెనీ రూ.110ను ప్రకటించింది. కంపెనీ జనవరి- డిసెంబరును ఆర్థిక సంవత్సరంగా పాటిస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని