చమురు-గ్యాస్‌ వెలికితీతకు మా దేశానికి రండి
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చమురు-గ్యాస్‌ వెలికితీతకు మా దేశానికి రండి

అంతర్జాతీయ సీఈఓలకు ప్రధాని ఆహ్వానం

దిల్లీ: భారత్‌లో చమురు-గ్యాస్‌ వెలికితీతకు రావాల్సిందిగా అంతర్జాతీయ చమురు-సహజ వాయువు దిగ్గజ సంస్థల సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.  ఈ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఆయన వారికి విపులంగా వివరించారు. చమురు-గ్యాస్‌ రంగ నిపుణులు, సీఈఓలతో బుధవారం ప్రధాని వార్షిక సమావేశం నిర్వహించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఏడేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యాస్‌ వెలికితీత-లైసెన్సింగ్‌ విధానం, సహజ వాయువు మార్కెటింగ్‌, కోల్‌బెడ్‌ మీథేన్‌ విధానాలు, కోల్‌ గ్యాసిఫికేషన్‌, ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటు వంటి సంస్కరణల గురించి వివరించారు. ఈ రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించేవరకు ఈ సంస్కరణలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆదాయం నుంచి ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశంలో సహజ వాయువుకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా పైప్‌లైన్లు, సిటీ గ్యాస్‌ పంపిణీ, ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్‌ టెర్మినల్స్‌ వంటి మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి ఈ రంగంపై నిర్వహిస్తున్న సమావేశాల్లో వస్తున్న ఆలోచనలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాస్‌నెఫ్ట్‌ సీఈఓ ఇగోర్‌ సెచిన్‌, సౌదీ అరామ్‌కో సీఈఓ అమిన్‌ నాజర్‌, బీపీ సీఈఓ బెర్నార్డ్‌ లూనే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ, వేదాంతా అధిపతి అనిల్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొని తమ విలువైన సూచనలు, సలహాలు అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని