కార్యాలయ స్థలానికి బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే అధిక గిరాకీ
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్యాలయ స్థలానికి బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే అధిక గిరాకీ

‘కోలియర్స్‌’ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: కార్యాలయ స్థలానికి హైదరాబాద్‌ లో గిరాకీ పెరిగిందని అమెరికాకు చెందిన ప్రొఫెషనల్‌ సేవల సంస్థ అయిన కోలియర్స్‌ అనుబంధ కోలియర్స్‌ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జులై- సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 6 పెద్ద నగరాల్లో 1.03 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని సంస్థలు అద్దెకు తీసుకున్నాయని, 2020 నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్న కాలం ఇదేనని వివరించింది. ఐటీ నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలలో ఆఫీసు స్థలానికి అధికంగా డిమాండ్‌ లభించింది. హైదరాబాద్‌లో 25 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అద్దెకు తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. తద్వారా బెంగళూరు (21 లక్షల చ.అ.) సహా ఇతర నగరాలను మించిపోయినట్లు వివరించింది. కరోనా ప్రభావం నుంచి కోలుకుని, వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, అందువల్ల ఆఫీసు స్థలానికి గిరాకీ ఏర్పడిందని కోలియర్స్‌ ఇండియా సీఈఓ రమేష్‌ నాయర్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని