మార్కెట్‌ దిద్దుబాటుకు అవకాశం
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌ దిద్దుబాటుకు అవకాశం

సామ్కో మ్యూచువల్‌ ఫండ్‌ వ్యవస్థాపకుడు జిమీత్‌ మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొంతకాలంగా దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్‌ సూచీల్లో కాస్త దిద్దుబాటు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల మదుపరులు క్రమానుగత పెట్టుబడులను నిర్వహించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి’ అని సామ్కో మ్యూచువల్‌ ఫండ్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ జిమీత్‌ మోదీ తెలిపారు. ఇటీవలే మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్సు పొందిన ఈ సంస్థ తన తొలి ఫండ్‌ను వచ్చే జనవరిలో విడుదల చేయనుంది. 16 దేశీయ, 9 అంతర్జాతీయ సంస్థల్లో మదుపు చేసేలా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ను తెస్తున్నట్లు జిమీత్‌ తెలిపారు. ‘స్ట్రెస్‌ టెస్ట్‌’ విధానంలో 6 రకాల పరీక్షల్లో విజయం సాధించిన కంపెనీలనే పెట్టుబడుల కోసం ఎంచుకుంటామన్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువ శాతం మంది స్థిరాస్తిలాంటి వాటిపైనే దృష్టి పెడుతున్నారు. అయితే యువత స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్లలో ఎక్కువగా మదుపు చేస్తున్నారు. రూ.40 లక్షల కోట్ల మ్యూచువల్‌ ఫండ్లలో తెలంగాణ వాటా 1.6 శాతమే’అని వెల్లడించారు. కొవిడ్‌ పూర్తి స్థాయి నియంత్రణ, ఆర్థిక వృద్ధి తదితర అంశాల ఆధారంగా సూచీల గమనం ఆధారపడి ఉంటుందన్నారు. ‘ప్రభుత్వ బ్యాంకులు, స్థిరాస్తి స్టీల్‌, సిమెంట్‌ సంస్థల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినియోగ వస్తువులు, ఐటీ/ఐటీసేవలు, ప్రైవేటు బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు, బంగారం రుణాల సంస్థలు కాస్త ఆసక్తిగా కనిపిస్తున్నాయ’ని తెలిపారు. దీర్ఘకాల దృష్టితో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా మార్కెట్‌ సగటును సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని