HDFC: రెండు లక్షల గ్రామాలకు మా బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తాం! - hdfc bank to double rural reach to 2 lakh villages in two years
close

Updated : 26/09/2021 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HDFC: రెండు లక్షల గ్రామాలకు మా బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తాం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న 18- 24 నెలల వ్యవధిలో భారత్‌లోని రెండు లక్షల గ్రామాలకు తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో సేవలు అందిస్తున్నట్లు, తాజా లక్ష్యం నెరవేరితే మొత్తం మూడో వంతు పల్లెలకు విస్తరించినట్లవుతుందని తెలిపింది. బ్యాంకు శాఖలు, బిజినెస్ కరస్పాండెంట్‌లు, క్షేత్రస్థాయి సిబ్బంది, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, కార్యక్రమాల ద్వారా ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

‘బ్యాంకింగ్‌, రుణాల విషయంలో దేశంలోని గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లలో పరిమిత సేవలు అందుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతాలు.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిర, దీర్ఘకాలిక అభివృద్ధికి విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి పిన్‌కోడ్‌ పరిధిలో మా సేవలు అందేలా ముందుకెళ్తున్నాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా తెలిపారు. బ్యాంకు సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా రానున్న ఆరు నెలల్లో 2,500 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం.. వివిధ పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుస్తోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో బాధ్యతాయుత పాత్రగా.. సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన సేవలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం’ అని శుక్లా వివరించారు. డిజిటల్‌ వేదికల ద్వారా మారుమూల ప్రాంతాలకూ సేవలు అందజేస్తామని తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని