ఈపీఎఫ్ వ‌డ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసా? - how-EPF-interest-is-calculated
close

Published : 23/01/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈపీఎఫ్ వ‌డ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసా?

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి 8.5 శాతం వ‌డ్డీ రేటును ఈపీఎఫ్ స‌భ్యుల ఖాతాకు జ‌మచేస్తామ‌ని ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్(ఈపీఎఫ్ఓ) గ‌త డిసెంబ‌రులో ప్ర‌క‌టించింది.ఈ వ‌డ్డీని ఎవ‌రు నిర్ణ‌యిస్తారు, ఏవిధంగా లెక్కిస్తారు అనే విష‌యాలు ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం. 

ఎవ‌రు నిర్ణ‌యిస్తారు..

ఈపీఎఫ్ ఖాతా వ‌డ్డీ రేటును కేంద్ర కార్య‌క‌ర్త‌ల మండ‌లి (సీబిటి) నిర్ణ‌యిస్తుంది. ఇది ఈపీఎఫ్‌ఓ అత్యున్నత నిర్ణయాత్మ‌క‌ సంస్థ. ఇందులో సంస్థ య‌జ‌మానులు, ఉద్యోగులు, ప్ర‌భుత్వం త‌రపు ప్ర‌తినిధులు ఉంటారు. సీబిటీ నిర్ణ‌యించిన వ‌డ్డీ రేటును ఆర్ధిక మంత్రిత్వ శాఖ‌కు పంపుతారు. ఈ శాఖ ఆమోదం పొందిన త‌రువాత వడ్డీని ఈపీఎఫ్ఓ స‌భ్యుల ఖాతాకు జ‌మ చేస్తుంది. ‌ 

వ‌డ్డీ లెక్కింపు విధానం..

జీతం ద్వారా ఆదాయం ఉన్న ఉద్యోగులు, వారి జీతం(బేసిక్‌+డిఏ)లో 12 శాతం మొత్తాన్ని ప్ర‌తినెలా ప్రావిడెండ్ ఫండ్ ఖాతాకు ఇస్తారు. ఉద్యోగుల స‌హ‌కారం‌కు స‌మానమైన‌ మొత్తాన్ని సంస్థ ప్ర‌తి నెల అందిస్తుంది. ఇందులో 8.33 శాతం ఉద్యోగుల పెన్ష‌న్ స్కీమ్‌(ఈపీఎస్‌)కు, మిగిలిన‌ది ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ ఖాతాకు వెళుతుంది.  ఈపీఎస్ అందించే స‌హ‌కారంలో ప‌రిమితి ఉన్న వారికి రూ.15వేల‌లో 8.33 శాతం అంటే రూ.1250 ఈపీఎస్‌కి చేరుతుంది. మిగిలిన మొత్తం ఈపీఎఫ్‌కి జ‌మ‌‌వుతుంది. సెప్టెంబ‌రు 2014కి త‌రువాత ఉద్యోగంలో చేరిన వారు ఈపీఎస్‌కి త‌ప్ప‌నిస‌రిగా కాంట్రీబ్యూట్ చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అందువ‌ల్ల సంస్ధ మొత్తం కాంట్రీబ్యూష‌న్ ఈపీఎఫ్ ఖాతాకు జ‌మ చేసుకోవ‌చ్చు. 


ఉదాహ‌ర‌ణ‌కి, ఒక వ్య‌క్తి ప్ర‌తినెల వ‌చ్చే జీతం(బేసిక్‌+అలవెన్స్‌) రూ.20వేలు వ‌స్తుంద‌నుకుందాం. అత‌ను సెప్టెంబ‌రు 2014 త‌రువాత స‌భ్యుడైతే ఈపీఎఫ్‌కు ఉద్యోగి అందించే సహ‌కారం రూ.2400, సంస్థ స‌హ‌కారం రూ.2,400.

సెప్టెంబ‌రు 2014కి ముందు స‌భ్యుడైతే సంస్ధ అందించే కాంట్రీబ్యూష‌న్ రూ.2400 లో నుంచి రూ.1250(రూ.15000 x 8.33/100) తీసివేయ‌గా మిగిలిన మొత్తం రూ.1150 ఖాతాకు చేరుతుంది. అంటే మొత్తంగా ఉద్యోగి అందించే రూ.2400+ సంస్థ అందించే రూ.1150 మొత్తంగా రూ.3550 ప్ర‌తినెల ఖాతాకు చేరుతుంది. 

వార్షిక వ‌డ్డీ రేటు రూ.8.5 శాతం అనుకుంటే నెల‌వారి వ‌ర్తించే వ‌డ్డీ రేటు 0.7083 శాతం అవుతుంది. 

మీ కాంట్రీబ్యూష‌న్ ఏప్రిల్ నుంచి ప్రారంభ‌మైతే  ప్ర‌తినెల ఈపీఎఫ్‌కి చేరే మొత్తం రూ.3550.  ఇక్క‌డ ఒక విష‌యం గుర్తించుకోండి ఏప్రిల్ నెల‌కి మీకు వ‌డ్డీ రాదు. ఎందుకంటే ఉద్యోగి జీతం, నెల ఆఖ‌రుకి జ‌మవుతుంది. అందువ‌ల్ల నెల చివ‌రికి మీ ఖాతాలో ఉండే మొత్తం రూ.3550. మే చివ‌రికి ఉద్యోగి, సంస్థ స‌హాకారంతో మ‌రో రూ.3550 ఖాతాలో జ‌మవుతుంది. కాబ‌ట్టి మే చివ‌రికి ఖాతాలో ఉండే బ్యాలెన్స్ రూ. 7,100 x నెల‌వారీ వ‌డ్డీ రేటు 0.7083% =  రూ.50 వ‌డ్డీ వ‌స్తుంది. 

మిగిలిన నెల‌ల‌కు కూడా ఇదే విధంగా వ‌డ్డీ లెక్కిస్తారు. మొత్తం వ‌డ్డీని ఆర్ధిక సంవ‌త్స‌రం చివ‌రిలో సిబిటీ నిర్ణ‌యించిన వ‌డ్డీ రేటును ఆర్ధిక శాఖ మంత్రి ఆమోదించిన త‌రువాత‌  ఈపీఎఫ్ఓ ఖాతాకు జ‌మ‌చేస్తారు. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని