సరికొత్త శిఖరాలకు సూచీలు - indices hit fresh high
close

Published : 07/01/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త శిఖరాలకు సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు సరికొత్త శిఖరాలను చేరాయి. గురువారం ఉదయం మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.36 సమయంలో సెన్సెక్స్‌ 213 పాయింట్లు పెరిగి 48,387 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 14,215 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. గాబ్రియల్‌ ఇండియా, పీసీ జ్యూవెలర్స్‌, శ్రీరామ్‌ సిటీ, జేకే సిమెంట్‌, ఇండియాగ్లైక్లోస్‌ లాభాల్లో ఉండగా.. ఐనాక్స్‌ లేజర్‌, ట్రైడెంట్‌ లిమిటెడ్‌, వెంకీస్‌(ఇండియా), అలేఖ్య ఎమినీస్‌, వినతి ఆర్గానిక్స్‌ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13పైసల నష్టంతో రూ.73.07 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ సూచీ భారీ లాభాల్లో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై ప్రీమియం తగ్గించడం సూచికి కలిసొచ్చింది. దీంతో మూడు శాతం లాభపడింది. ఫలితంగా నిఫ్టీ 14,220 మార్క్‌ తొలిసారి దాటింది.

ఇవీ చదవండి

ఆఫీసు స్థలానికి పెరిగిన గిరాకీ
టయోటా కొత్త ఫార్చునర్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని