మార్కెట్లోకి మేడిన్ ఇన్‌ ఇండియా ‘వ్రాంగ్లర్‌’ - jeep India launches locally assembled Wrangler
close

Updated : 17/03/2021 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి మేడిన్ ఇన్‌ ఇండియా ‘వ్రాంగ్లర్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలిసారి దేశీయంగా తయారు చేసిన ఎస్‌యూవీ వ్రాంగ్లర్‌ను జీప్‌ ఇండియా బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.53.90లక్షలు(ఎక్స్‌షోరూం). గత వెర్షన్లతో పోలిస్తే దీని ధర దాదాపు రూ.10లక్షల వరకు తగ్గింది. భారత్‌లో తయారు చేయడం వల్లే ధర తగ్గించగలిగామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఇది కేవలం పెట్రోల్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అన్‌లిమిటెడ్‌, రుబికాన్‌ అనే రెండు వేరియంట్లలో లభించనుంది.

విదేశాల్లో ఉత్పత్తి అయిన ఓ కారుని భారత్‌కు దిగుమతి చేసుకొని, అనుసంధానం చేసి అమ్మడం జీప్‌ ఇండియాకు ఇదే తొలిసారి. పుణెలోని రంజన్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో దీన్ని తయారు చేశారు. 2022లో గ్రాండ్‌ చెరోకీ ఎస్‌యూవీని కూడా ఇక్కడే అసెంబుల్‌ చేయాలని యోచిస్తున్నారు. తద్వారా ఖర్చు తగ్గి ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వచ్చే వ్రాంగ్లర్‌ అత్యధికంగా 262 హెచ్‌పీ శక్తిని, 400 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఆటోమేటిక్‌ హెడ్‌లైట్స్‌, ఎల్‌ఈడీ ఇంటీరియర్‌ లైట్స్‌, ఆటో డిమ్మింగ్‌ రేర్‌వ్యూ మిర్రర్‌, 8.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, లెదర్‌ ఫినిష్డ్‌ డ్యాష్‌బోర్డ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి.

ఇవీ చదవండి...

రూ.4.10 కోట్ల బెంట్లీ కారు

కార్లలో వైరస్‌లను నిరోధించే సాంకేతికత!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని