ఆర్థిక సేవల కంపెనీల్లో పరోక్ష పెట్టుబడికి..
close

Published : 23/07/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక సేవల కంపెనీల్లో పరోక్ష పెట్టుబడికి..

మిరే అసెట్‌ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్

మిరే అసెట్ మ్యూచువల్‌ ఫండ్‌ ఆర్థిక సేవల రంగానికి చెందిన కొన్ని కంపెనీలపై పెట్టుబడి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఒక ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్‌) పథకాన్ని ఆవిష్కరించింది. మిరే అసెట్ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్‌ అనే ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 29న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ‘నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టీఆర్‌ఐ’ సూచీని దీని పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ‘నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టీఆర్‌ఐ’లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌... తదితర కంపెనీలు ఉన్నాయి. మిరే అసెట్ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్‌ పథకం ద్వారా పెట్టుబడికి ఆర్థిక సేవల రంగానికి చెందిన 20 కంపెనీలను ఎంచుకుంటారు.

మిరే అసెట్‌ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదు చేస్తారు. ఆర్థిక సేవల రంగంలోని వ్యాపార సంస్థలు... సమీప భవిష్యత్తులో ఈ రంగానికి చెందిన కంపెనీలు వృద్ధి బాటలో ముందుకు సాగుతాయని, తద్వారా ఆయా కంపెనీల షేర్లపై మంచి లాభాలు వస్తాయని స్టాక్‌ మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక కంపెనీపై నేరుగా పెట్టుబడి పెట్టే బదులు, ఇరవై కంపెనీల పోర్ట్‌ఫోలియో ఉండే మిరే అసెట్‌ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్‌ పథకం రిటైల్‌ మదుపరులు పరిశీలించదగినదేని చెప్పవచ్చు.


ఎఫ్‌ఎంసీజీ రంగంలో...

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎఫ్‌ఎంసీజీ ఈటీఎఫ్‌

సీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగంలోని కంపెనీలపై పెట్టుబడి పెట్టే ఆసక్తి ఉన్న మదుపరుల కోసం ఒక ఈటీఎఫ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎఫ్‌ఎంసీజీ ఈటీఎఫ్‌’ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 2. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. కనీస పెట్టుబడి రూ.1000. నిఫీˆ్ట ఎఫ్‌ఎంసీజీ టీఆర్‌ఐ ఇండెక్స్‌ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ టీఆర్‌ఐ ఇండెక్స్‌లో 15 కంపెనీలు ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, ఐటీసీˆ, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, బ్రిటానియా, డాబర్‌, గోద్రెజ్‌ కన్సూమర్‌ ప్రోడక్ట్స్‌... తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి.  

ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన కంపెనీల్లో పరోక్ష పెట్టుబడికి ఈ పథకం మదుపరులకు వీలు కల్పిస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎఫ్‌ఎంసీజీ ఈటీఎఫ్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ల్లో నమోదు చేస్తారు. ప్రజల సగటు ఆదాయాలు పెరుగుతున్నందున వచ్చే కొన్నేళ్ల పాటు మనదేశంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఆవిష్కరించే ఉత్పత్తులకు అధిక గిరాకీ ఉంటుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థల్లో ఎఫ్‌ఎంసీజీ రంగం నాలుగో అతిపెద్దది. 2025 నాటికి ఈ రంగం వ్యాపార పరిమాణం 220 బిలియన్‌ డాలర్లకు  పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే, ఎఫ్‌ఎంసీజీ రంగంలోని అగ్రశ్రేణి కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు స్థిరమైన వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని