స్థిరాస్తిలో రూ.36,500 కోట్ల సంస్థాగత పెట్టుబడులు - rs 36500 cr investments in Real Estate
close

Published : 21/07/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థిరాస్తిలో రూ.36,500 కోట్ల సంస్థాగత పెట్టుబడులు

2021పై కొలియర్స్‌ ఇండియా అంచనా

దిల్లీ: ఈ ఏడాది స్థిరాస్తి రంగంలో సంస్థాగత పెట్టుబడులు 4 శాతం పెరిగి 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.36,500 కోట్లు)కు చేరే అవకాశం ఉందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా అంచనా వేసింది. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో ఆకర్షణీయ విలువలకు స్థిరాస్తులను దక్కించుకోవాలని పెట్టుబడిదారులు చూస్తున్నట్లు వెల్లడించింది. 2020లో స్థిరాస్తిలో సంస్థాగత పెట్టుబడులు 4.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2021 మొదటి ఆరు నెలల్లో భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు 2.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.21,170 కోట్లు)గా ఉన్నాయి. 2020 ఇదే సమయంతో పోలిస్తే ఇవి రెండింతలు అధికమని కొలియర్స్‌ ఇండియా తెలిపింది. కార్యాలయ ఆస్తులపై పెట్టుబడిదార్లు అధిక ఆసక్తి చూపుతున్నారని.. మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 35 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

నివేదికలో మరిన్ని అంశాలు ఇలా..
జనవరి- జూన్‌ మధ్య పారిశ్రామిక, గోదాముల రంగంలోకి 775 మిలియన్‌ డాలర్లు (రూ.5,657 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. 2016 తర్వాత ఒక ఏడాదిలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవే. స్థిరాస్తిలో సంస్థాగత పెట్టుబడుల్లో వీటి వాటా 27 శాతంగా ఉంది.
నివాస రంగానికి నగదు లభ్యత సవాళ్లు కొనసాగాయి. మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 4 శాతం మాత్రమే.
అంతర్జాతీయ డేటా కేంద్రాల నిర్వహణ సంస్థలతో కార్పొరేట్‌ల ఒప్పందాల నేపథ్యంలో డేటా కేంద్రాల్లో పెట్టుబడులుగా 161 మిలియన్‌ డాలర్లు (రూ.1175 కోట్లు) వచ్చాయి. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని