కరోనాతో ప్రజలపై రూ.66,000 కోట్ల భారం - sixty six thousand crores burden on people with corona
close

Published : 19/05/2021 19:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో ప్రజలపై రూ.66,000 కోట్ల భారం

ఎస్‌బీఐ నివేదిక అంచనా 

ఈనాడు-దిల్లీ: కరోనా ఫలితంగా ధరల పెరుగుదల, ఆసుపత్రులు, వైద్య ఖర్చుల కారణంగా ఈ ఏడాది ప్రజలపై రూ.66వేల కోట్ల మేర అదనపు భారం పడనున్నట్లు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ధరలపై  ప్రభావం చూపి రూ.15వేల కోట్లు, ఆసుపత్రులకోసం రూ.35వేల కోట్లు, ఆదాయం తగ్గిపోవడం వల్ల రూ.16వేల కోట్ల భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తున్నట్లు తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో వైద్యఖర్చు రూ.6లక్షల కోట్లతో పోలిస్తే ఇది 11% అదనం అని అభిప్రాయపడింది. మహమ్మారి మూడురకాల ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంది.

ధరలపై ప్రభావం 
ప్రస్తుతం వైద్యఖర్చులు పెరగడంతో సాధారణ వినియోగ ధరల సూచిలో వైద్య ద్రవ్యోల్బణం సగటు వాటా పెరుగుతుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌సీఈ (ప్రైవేటు ఫైనాన్షియల్‌ కన్సంప్షన్‌ ఎక్స్‌పెండీచర్‌) వాటాను పరిగణనలోకి తీసుకొని, దాన్ని ప్రస్తుత వినియోగధరల సూచీతో సర్దుబాటుచేసి చూస్తే కనీసం దాదాపు రూ.15వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లు కనిపిస్తోంది. ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

ఆసుపత్రుల ఖర్చు
 కొవిడ్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం నడుస్తున్న సరళిని బట్టి, వైరస్‌ బారిన పడ్డ వారిలో కనీసం 30% మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అందులో కనీసం 30% మంది ప్రైవేటు ఆసుపత్రులను ఎంచుకుంటున్నారు. ఇందులో ఒక్కోరికి కనీసం రూ.1.50 లక్షల ఖర్చయినట్లు పరిగణలోకి తీసుకున్నప్పటికీ మొత్తం భారం రూ.35వేల కోట్ల మేర ఉంటుంది. 

ఆదాయంపై ప్రభావం
ధరలు, ఆసుపత్రుల భారమే కాకుండా కరోనా కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడంవల్ల కుటుంబ తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.8,637మేర తగ్గతున్నట్లు ప్రధాన గణాంక కార్యాలయం అంచనా వేసింది. ప్రైవేటు, అసంఘటిత రంగ కార్మికులపై దీని ప్రభావాన్ని కనిష్ఠస్థాయిలో లెక్కించినా రూ.16వేల కోట్లమేర ఆదాయం కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఖర్చులు పెరిగిన కుటుంబాలపై ఈ ఆదాయ నష్టం అదనపు భారం. దీనివల్ల ఈ కుటుంబాలు ఇతర ఖర్చులను తగ్గించుకొని ఆ మొత్తాన్ని వైద్య ఖర్చుల కోసం మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఎలా? ఎంత నష్టం

విషయం  రూ.కోట్లలో
ద్రవ్యోల్బణ ప్రభావంతో ధరల పెరుగుదల 15,000
ఆసుపత్రి ఖర్చులు 35,000
ఉపాధిపై ప్రభావం పడి ఆదాయ నష్టం 16,000
మొత్తం నష్టం 66,000

  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని