close

Published : 14/01/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం

దిల్లీ: వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.22 శాతానికి తగ్గింది. నవంబర్లో ఇది 1.55%, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్‌కు 0.92 శాతానికి తగ్గిపోవడం గమనార్హం.

డిసెంబర్లో కూరగాయాల టోకు ధరలు (-) 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. నవంబర్లో ఇది 12.24 శాతంగా ఉండేదని వెల్లడించింది.  నవంబర్లో 115.12 శాతంగా ఉన్న బంగాళాదుంపల ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు 37.75 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలతో పోలిస్తే వరి, ధాన్యాలు, గోధుమలు, పప్పుల ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో మరింత తగ్గింది.

ఆహార ధరల ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుండగా డిసెంబర్లో తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 4.24 శాతానికి పెరిగాయి. నవంబర్లో ఇది 2.97 శాతంగా ఉండటం గమనార్హం. ఫలితంగా ఆహార వస్తువు, పానీయాలు, వస్త్రాలు, రసాయనాలు, ఔషధాలు, సిమెంటు ధరలు పెరిగాయి. ఇంధనం, విద్యుత్‌ ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. కాగా డిసెంబర్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం 4.59 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
అసలు ఎంత పొదుపు చేయాలి?
 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని