close

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి అంబానీ పైప్‌లైన్‌

రూ.13,000 కోట్లకు కొనుగోలు
కాకినాడ నుంచి గుజరాత్‌ వరకు

ముంబయి: ఆంధ్రప్రదేశ్‌ లోని కాకినాడ నుంచి గుజరాత్‌ లోని భారుచ్‌ వరకు ముకేశ్‌ అంబానీ నిర్మించిన 1400 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్‌ వెస్ట్‌ పైప్‌లైన్‌ (ఈడబ్ల్యూపీఎల్‌) (గతంలో రిలయన్స్‌ గ్యాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ను రూ.13,000 కోట్ల (2 బిలియన్‌ డాలర్ల)కు కొనుగోలు చేస్తున్నట్లు కెనడా పెట్టుబడి సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌ గురువారం ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ నష్టాల్లో ఉంది. ప్రైవేట్‌రంగ పైపులైను ప్రాజెక్టును మరో సంస్థ కొనుగోలు చేయడం కూడా దేశంలో తొలిసారే. రిలయన్స్‌ జియోకు చెందిన టెలికాం టవర్‌ ఆస్తులను కూడా బ్రూక్‌ఫీల్డ్‌ 7-8 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్‌ (ఇన్‌వైట్‌)ఏర్పాటుకు బ్రూక్‌ఫీల్డ్‌ ప్రాథమిక దరఖాస్తు పత్రాన్ని దాఖలు చేసింది. ఇన్‌వైట్‌ ప్రాయోజిత సంస్థగా, 90 శాతంవాటాను బ్రూక్‌ఫీల్డ్‌ కలిగి ఉంటుంది. ప్రస్తుతం పైప్‌లైన్‌ను నిర్వహస్తున్న పైప్‌లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను ఇన్‌వైట్‌ కొనుగోలు చేస్తుంది.

సహజవాయువు సరఫరా కోసం..
కృష్ణా-గోదావరి బేసిన్‌ నుంచి సహజవాయువును పశ్చిమ తీరంలోని భారుచ్‌కు సరఫరా చేసేందుకు రిలయన్స్‌-బీపీ సంస్థలు ఈడబ్ల్యూపీఎల్‌ను నిర్మించింది. ఇప్పుడీ ప్రాజెక్ట్‌ను బ్రూక్‌ఫీల్డ్‌ రూ.13,000 కోట్లకు కొనుగోలు చేయనుంది. యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకులు ఇందుకు రుణం అందిస్తాయి. మిగిలిన పెట్టుబడిదార్లు కూడా రూ.1000-1200 కోట్లు తమ వాటాగా పెట్టి 10-15 శాతం వాటా పొందుతారు.

* విక్రయ ఒప్పందం ప్రకారం పీఐపీఎల్‌లో ఇన్‌వైట్‌కు ఉన్న వాటాలను, రూ.50 కోట్ల చొప్పున రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) కొనుగోలు చేయొచ్చు. ప్రిఫరెన్స్‌ షేర్లలో ఆర్‌ఐఎల్‌కు ఉన్న పెట్టుబడి విలువ రూ.4000 కోట్లు కొనసాగుతుంది. ఇది 20 ఏళ్ల తరవాత ఈక్విటీగా మారుతుంది.
* ఈ పైప్‌లైన్‌లో సహజవాయువు సరఫరాను ఆర్‌ఐఎల్‌ సొంతగా లేదా ఖాతాదారుల ద్వారా, ఉచితంగా కొనసాగించే వీలుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.