close
మార్కెట్‌ కబుర్లు

* డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను దివాలా ప్రక్రియకు అనుమతించాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గత శుక్రవారం వేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ-ముంబయి సోమవారం స్వీకరించింది.
* నవంబరులో ఎన్‌సీసీకి రూ.243 కోట్ల విలువైన పనులు లభించాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్ల విభాగానికి ఈ ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ తెలిపింది.
* తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా సుమారు రూ.1,800-2000 కోట్ల నిధుల్ని సమీకరించుకునేందుకు సంహి హోటల్స్‌కు సెబీ నుంచి అనుమతి లభించింది.
* ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థల (ఎస్‌టీయూ) నుంచి 2,300కు పైగా బస్సుల తయారీ ఆర్డర్లు దక్కించుకున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది.
* ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) ఇష్యూ తొలి రోజే 1.62 రెట్ల స్పందన లభించింది. రిటైల్‌ విభాగంలో ఏకంగా 8.61 రెట్ల స్పందన రావడం విశేషం.
* ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) 2019 సెప్టెంబరు నాటికి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్లలో (ఈటీఎఫ్‌) రూ.86,966 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కార్మిక మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.