close

ప్రధానాంశాలు

అత్యవసరాల కోసం రుణాలు

కరోనా నేపథ్యంలో బ్యాంకుల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రబలుతుండటంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి నడుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సంస్థలు మూతబడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ ఖాతాదారుల కోసం పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రత్యేక రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వీటిని ప్రకటించగా.. తాజాగా మరికొన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి. మొత్తం 15 బ్యాంకులు ఈ రకమైన ప్రకటనలు చేశాయి. కార్పొరేట్‌ సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లతో పాటు వ్యవసాయదారులకు, స్వయం సహాయక బృందాలకు, రిటైలర్లు, పింఛనర్లకు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

* ఇండియన్‌ బ్యాంక్‌ 5 రకాల ప్రత్యేక రుణ పథకాలు ప్రవేశపెట్టినట్లు బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మజా చుండూరు తెలిపారు. వ్యాపారాలు కుదుటపడ్డ తర్వాతే వాయిదాలు చెల్లించే విధంగా దీర్ఘకాలిక వ్యవధికి వీటిని అందిస్తున్నట్లు చెప్పారు. నిర్వహణ మూలధనంలో 10శాతం వరకూ.. గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకూ ఈ రుణాలను ఇస్తున్నట్లు వెల్లడించారు. మొదటి 6 నెలలు మారటోరియం ఉంటుందని, 36 నెలల్లోగా రుణం తీర్చే అవకాశం ఉంటుందన్నారు.
* యూనియన్‌ బ్యాంక్‌.. మూలధనంలో గరిష్ఠంగా 10శాతం వరకూ రుణంగా తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. సెప్టెంబరు 30 వôకు ఈ రుణాలను ఇస్తున్నట్లు చెప్పింది. మొదటి 12 నెలలపాటు మారటోరియం ఉంటుందనీ, ఆ తర్వాత 36 నెలల్లోగా రుణాన్ని తీర్చాలని చెబుతోంది. ఎంఎస్‌ఎంఈలు గరిష్ఠంగా రూ.10 కోట్లు, కార్పొరేట్లకు రూ.50 కోట్ల వరకూ రుణం అందించనుంది.
* కెనరా బ్యాంక్‌ కూడా ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్లు, వ్యాపార సంస్థలు, రిటైల్‌ రుణదాతల కోసం కెనరా క్రెడిట్‌ సపోర్ట్‌ - కొవిడ్‌-19 పేరుతో రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. నిర్వహణ మూలధనంలో 10%-35% వరకూ దీనిని ఇస్తున్నట్లు తెలిపింది. జూన్‌ 30 వరకూ ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది.
* ఆంధ్రాబ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంకు, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లు కూడా ప్రత్యేక రుణ పథకాలను ప్రవేశ పెట్టాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.