close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (02/03/2020)

1. వన్‌ప్లస్‌ ఈసారి ఏం తీసుకొస్తుందో?

కాన్సెప్ట్‌ ఫోన్‌ పేరుతో ఇటీవల ఓ మొబైల్‌ తీసుకొచ్చిన వన్‌ప్లస్‌... మంగళవారం (మార్చి 3)న మరో డివైజ్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి వన్‌ప్లస్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అయితే ఇది మొబైల్‌ / కమర్షియల్‌ ప్రోడక్ట్‌ కాదు. చూడటానికి కెమెరాలా కనిపిస్తున్న ఈ ప్రోడక్ట్‌కు సంబంధించి ఇతర సమాచారం అందుబాటులో లేదు. అన్నట్లు వన్‌ప్లస్‌ నుంచి ఈ నెలలోనే వన్‌ప్లస్‌ 8, వన్‌ప్లస్‌ 8 ప్రో రాబోతున్నాయి.


2. స్మార్ట్‌ కరెంట్‌ పోల్స్‌...

మన ఊళ్లో రోడ్డు పక్కనో, డివైడర్ల దగ్గరో ఉన్న కరెంట్‌ పోల్స్‌ చూసుంటారు. పైన ఒక బల్బు, మధ్యలో ఒక పవర్‌ బాక్స్‌ కనిపిస్తాయి. అదే ఫిన్లాండ్‌లోని నోకియా ఎస్పో క్యాంపస్‌లో చూస్తే సెన్సర్లు, కెమెరాలు, 5జీ ఎమిటర్స్‌ కనిపిస్తాయి. అవును.. ఫిన్లాండ్‌లో స్మార్ట్‌ పోల్స్‌ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నోకియా ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. నోకియా ఇన్నోవేట్స్‌ పేరుతో నోకియా సంస్థ ఈ సర్వీసుల్ని నిర్వహిస్తోంది. త్వరలో ఈ స్మార్ట్‌ పోల్స్‌ మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారని తెలుస్తోంది. 


3. వేలానికి చిరస్మరణీయ ఆపిల్‌ వస్తువులు

పురాతన, విలువైన ఆపిల్‌ గ్యాడ్జెట్‌, ఆ సంస్థకు చెందిన వస్తువుల్ని సొంతం చేసుకోవాలని ఉందా? అయితే వేలం పాటలో పాల్గొనడానికి సిద్ధమవ్వండి. ‘ది స్టీవ్‌ జాబ్స్‌ ఆక్షన్‌’ పేరుతో ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఇందులో 1970 నుంచి 1980ల కాలం నాటి ఆపిల్‌ ఉత్పత్తుల్ని సొంతం చేసుకోవచ్చు. అందులో కొన్నింటిపై స్టీవ్‌ జాబ్‌ సంతకం కూడా ఉంటుంది. ఈ నెల 5 నుంచి 12 వరకు ఈ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ జరుగుతుంది. ఈ లింక్‌ క్లిక్‌ చేసి వేలంపాటలో అందుబాటులో ఉన్న వస్తువుల్ని చూడొచ్చు. మీకు ఆసక్తి ఉంటే బిడ్డింగ్‌ పాల్గొనొచ్చు కూడా. 


4. శాంసంగ్‌ నుంచి ‘లైట్‌’గా ట్యాబ్‌

శాంసంగ్‌ నుంచి గతేడాది వచ్చిన గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌6కి లైట్‌ వెర్షన్‌ రాబోతోందా? అవుననే అంటున్నాయి టెక్‌ వర్గాలు. ట్యాబ్‌ ఎస్‌6 సైజులోనే రాబోతున్న ఈ లైట్‌ వెర్షన్‌ ఉండబోతోందట. భారత్‌లో ఎగ్జినోస్‌ 9611 చిప్‌సెట్‌ ఇస్తున్నారు. విదేశాల్లో స్నాప్‌డ్రాగన్‌ 600 సిరీస్‌ ప్రాసెసర్‌ ఉండొచ్చు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ/12 జీబీ స్టోరేజీతో ఈ ట్యాబ్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. దీని ధర సుమారు ₹30 వేలు ఉంటుందని సమాచారం. 


5. మూడో బ్లాక్‌ షార్క్‌లో మూడు కెమెరాలు

షావోమీ గేమింగ్ మొబైల్స్‌ సిరీస్‌ బ్లాక్‌షార్క్‌లో మూడో మొబైల్‌ రాబోతోంది. ‘బ్లాక్‌షార్క్‌ 3’గా వస్తున్న ఇందులో వెనుకవైపు త్రిభుజాకారంలో మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ఇందులో మెయిన్‌ కెమెరా 64 ఎంపీ సెన్సర్‌ ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉంటుంది. 16 జీబీ ర్యామ్‌తో రానున్న ఈ మొబైల్‌లో 120 హెడ్జ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ వరుసలో బ్లాక్‌షార్క్‌ 3 ప్రో మొబైల్‌ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ మొబైల్‌ 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు  సపోర్ట్‌ చేస్తుంది.


6. సింగిల్‌ కెమెరాతోనూ 3D

ఫేస్‌బుక్‌లో త్రీడీ ఫొటోలు చూసే ఉంటారు. ఇటీవల ఎఫ్‌బీ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ హైఎండ్‌, కొత్త తరం ఫోన్లలోనే పని చేస్తోంది. అంటే వెనుకవైపు రెండు, ఆ పైన కెమెరాలున్న మొబైల్స్‌ మాత్రమే ఈ ఫీచర్‌కు సపోర్టు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వెనుకవైపు ఒక కెమెరా మాత్రమే ఉన్న మొబైల్స్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారట. మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో 2డీ పిక్చర్‌ను 3డీలోకి మారుస్తున్నారు. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ వాడొచ్చు. 


7. పబ్‌జీ లైట్‌లోనూ నైట్‌మోడ్‌

బడ్జెట్‌ మొబైల్స్‌లో పబ్‌జీని అందుబాటులోకి తీసుకురావడానికి లైట్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. పబ్‌జీలోని కొన్ని ఆప్షన్లను తొలగించి కొత్త పబ్‌జీలా దీనిని రూపొందించారు. అయితే తర్వాతి రోజుల్లో కొత్త ఫీచర్లను యాడ్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నైట్‌మోడ్‌ను కూడా తీసుకొస్తున్నారు. నైట్‌విజన్‌ యాక్టివ్‌ అయినప్పుడు గాగుల్స్‌తో గేమ్‌ ఆడొచ్చు. ఇంకా మరికొన్ని ఆసక్తికర ఫీచర్లు రాబోతున్నాయి. 


8. వన్‌ప్లస్‌ 8 ఫ్రంట్‌ లుక్‌ ఇదిగో...

వన్‌ప్లస్‌ తాజా మొబైల్‌ ‘8’కు సంబంధించి ఇన్నాళ్లూ కొన్ని స్పెసిఫికేషన్ల తెలిశాయి. అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఈ మొబైల్‌ ఫ్రంట్‌ లుక్‌ ఇప్పుడు బయటికొచ్చింది. ఈ మొబైల్‌కు సంబంధించి స్టార్ట్‌ గైడ్‌ బుక్‌లెట్‌ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం చూస్తే ముందుగా అనుకున్నట్లే ఇందులో ఫ్రంట్‌ కటౌట్‌ డిస్‌ప్లే ఉంటుంది. గత మొబైల్స్‌ తరహాలోనే త్రీ స్టేజ్‌ మ్యూట్‌ కీ ఉంటుంది. ఈసారి వన్‌ప్లస్‌ ఐపీ53 వాటర్‌ ప్రూఫ్‌ సర్టిఫికెట్‌తో వస్తుంది.


9. హువావే 10ఈ ఇలా ఉంటుంది...

ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో హువావే కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. ఎంజాయ్‌ 10ఈ సిరీస్‌లో పేరుతో వచ్చిన ఈ మొబైల్స్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇందులో ఎంజాయ్‌ 10, ఎంజాయ్‌ 10ఎస్‌, ఎంజాయ్‌ 10 ప్లస్‌ మొబైల్స్‌ వస్తున్నాయి. ఇందులో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. మొబైల్‌ టు మొబైల్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. అత్యుత్తమ శబ్ద నాణ్యత కోసం హువావే సూపర్‌ సౌండ్‌ ఆడియో సిస్టమ్‌ను వాడుతున్నారు. ఈ మొబైల్‌ మన దేశానికి ఏ పేరుతో వస్తుందో చూడాలి. 


10. ఐఓఎస్‌ 14లో ఫీచర్లు ఇలా ఉండొచ్చు...

 కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.