close

అవీ... ఇవీ

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (05/02/2020)

1. నిమిషానికి నాలుగుసార్లు హనుమాన్‌ చాలీసా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయిస్‌ అసిస్టెంట్లలో 31 శాతం వాటా అమెజాన్‌ ఎకో డివైజ్‌లదే అని కానలిస్‌ రిపోర్ట్‌ చెబుతోంది. తర్వాత స్థానం గూగుల్ ‌(29శాతం)ది. మన దేశం విషయానికొస్తే అమెజాన్‌ అలెక్సా ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ‘హౌ ఆర్‌ యు’. నిమిషానికి 11 మంది ఈ ప్రశ్న అడుగుతున్నారట. ఆ తర్వాతి స్థానం హనుమాన్‌ చాలీసాది. నిమిషంలో నలుగురు హనుమాన్‌ చాలీసా ప్లే చేయమని అలెక్సాను అడుగుతున్నారట. మరోవైపు ‘ఐ లవ్‌ యూ’ అని నిమిషంలో ఇద్దరు అలెక్సాకి చెబుతున్నారట. 


2. హెడ్‌ఫోన్స్‌ గాలిని శుభ్రపరిచి ఇస్తే...
ప్రస్తుతం హెడ్‌ఫోన్స్‌ పాటలు వినడానికి, కాల్స్‌ మాట్లాడటానికి ఉపయోగపడుతున్నాయి. త్వరలో ఇవి గాలిని శుభ్రపరచడానికి కూడా వాడొచ్చు. ఈ మేరకు బ్రిటన్‌లో డైసన్‌ ఓ పేటెంట్‌ను ఫైల్‌ చేసింది. దాని ప్రకారం చూస్తే హెడ్‌ఫోన్‌ ఇయర్‌ కప్స్‌లో ఫ్యాన్‌ తరహాలో ఉండే ప్రొపెల్లర్స్‌ ఉంటాయి. అవి దగ్గర్లోని గాలిలోని దుమ్ము, బ్యాక్టీరియాను తొలగించి శుభ్రపరుస్తాయి. గాలి కాలుష్యంతో బాగా ఇబ్బందులు  పడుతున్న ఈ సమయంలో ఇలాంటి ఆవిష్కరణ ఆసక్తి కలిగించేదే. అయితే ఈ హెడ్‌ఫోన్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తెలియాల్సి ఉంది.


3. ఐక్యూ తొలి మొబైల్‌ ఫొటోలు లీక్‌...
ఐక్యూ (చైనాలో వివోకు సబ్‌ బ్రాండ్‌) నుంచి తొలి మొబైల్‌ మరికొద్ది రోజుల్లో భారత్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆ మొబైల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో రాబోతున్న ఈ మొబైల్‌లో సింగిల్‌ పంచ్‌హోల్‌ డిజైన్‌ ఉండబోతోంది. ఒప్పో రీనో3కి దగ్గరగా ఈ మొబైల్‌ ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి ఐక్యూ3 అని పేరుపెడతారని సమాచారం. ఇందులో ఓఎల్‌ఈడీ ప్యానల్‌ ఇస్తారని తెలుస్తోంది.


4. స్నాప్‌డ్రాగన్‌ కొత్త ప్రాసెసర్‌తో 8K 
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ కొత్త తరం ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ 865. ఈ ప్రాసెసర్‌ ఉన్న మొబైల్‌తో 8కె నాణ్యతతో వీడియో చిత్రీకరించొచ్చు. తాజాగా 8కె నాణ్యత ఉన్న వీడియోను స్నాప్‌డ్రాగన్‌ విడుదల చేసింది. మీరూ ఆ వీడియో నాణ్యతను ఇక్కడ చూడొచ్చు. 


5. హువావే కొత్త ఫోన్‌ లుక్‌
హువావే నుంచి ఫ్లాగ్‌షిప్‌ రేంజిలో త్వరలో ఓ మొబైల్‌ రాబోతున్న విషయం తెలిసిందే. హువావే పీ40 ప్రో పేరుతో రాబోతున్న ఈ మొబైల్‌కు సంబంధించిన ఓ లైవ్‌ ఫొటో అంటూ ఆన్‌లైన్‌లో తెగ సందడి చేస్తోంది. దాని ప్రకారం చూస్తే మొబైల్‌ ఫ్రంట్‌ సైడ్‌ పంచ్‌ హోల్‌లో రెండు కెమెరాలు ఉంటాయి. మేట్‌ 30 ప్రో స్టైల్‌లోనే కర్వడ్‌ బెజల్స్‌ ఉంటాయి. అయితే గత సిరీస్‌లో లేని ఫిజికట్‌ బటన్స్‌ ఇందులో ఉన్నాయి. క్వాడ్‌హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ రాబోతున్న విషయం తెలిసిందే.


6. వద్దనుకుంటే తీసేయొచ్చు
విండోస్‌ సిస్టమ్స్‌లో ఉండే డీఫాల్ట్‌ యాప్స్‌లో నోట్‌ ప్యాడ్‌ ఒకటి. ఈ ఫీచర్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేద్దామంటే వీలుపడదు. కానీ త్వరలో అదీ కుదురుతుందటున్నాయి టెక్‌ వర్గాలు. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పని చేసే కంప్యూటర్లలో సెట్టింగ్స్‌లోని ఆప్షన్‌ ఫీచర్స్‌లో ఈ ఆప్షన్‌ ఉంటుంది. పెయింట్‌, వర్డ్‌ప్యాడ్‌ తర్వాత ఈ ఆప్షన్‌ రాబోతున్న విండోస్‌ ఫీచర్‌ నోట్‌ ప్యాడే. నోట్‌ ప్యాడ్‌ యాప్‌ని స్టోర్‌లోకి తీసుకొచ్చే విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోందని తెలుస్తోంది.


7. ఫొటోలు తప్పుగా పంపిన గూగుల్‌ ఫొటోస్‌
ఒకరు స్టోర్‌ చేసిన ఫొటోలను గూగుల్‌ ఫొటోస్‌ మరొకరికి పంపేసింది. అదెలా సాధ్యమంటున్నారా? కానీ ఇది జరిగింది. మొత్తం గూగుల్‌ ఫొటోస్‌ యూజర్లలో 0.01 శాతం మంది ఖాతాల్లో ఇలాంటి సమస్య వచ్చిందని తెలుస్తోంది. అంతర్జాతీయ టెక్‌ వర్గాల సమాచారం ప్రకారం... సాంకేతిక లోపం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు గూగుల్‌ ఆ వినియోగదారులకు తెలిపిందట. నవంబరు 21 నుంచి 25 వరకు బ్యాకప్‌ అయిన డేటాలో సమస్యలు రావడం వల్ల ఈ పొరపాటు జరిగిందట. దీనికి సంబంధించి గూగుల్‌ నుంచి మెయిల్‌ అందుకున్న వినియోగదారులు ఆ సమయంలో బ్యాక్‌అప్‌ అయిన ఫొటోలను డిలీట్‌ చేసి మరోసారి అప్‌లోడ్‌ చేయవలసి ఉంటుంది. అయితే కచ్చితంగా ఎంతమంది వినియోగదారులు ఈ ఇబ్బంది ఎదుర్కొన్నారనేది తెలియడం లేదు. 


8. అప్‌డేట్‌ కాకపోతే యూట్యూబ్‌ ఆగిపోతుంది
మూడేళ్ల క్రితం యూట్యూబ్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ ఇంటర్ఫేస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్పట్లో యూట్యూబ్‌ మార్పులు చేసింది. అయితే అప్‌డేటెడ్‌ బ్రౌజర్లలోనే ఈ కొత్త వెర్షన్‌ అందుబాటులో ఉంటుందని అప్పుడు చెప్పింది. ఇప్పటి వరకు రెండు వెర్షన్లనూ కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మార్చిలో పాత ఇంటర్ఫేస్‌ను తీసేయాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్‌ కొత్త ఇంటర్ఫేస్‌ కోసం మీ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలంటూ ఇప్పుడు రిమైండర్స్‌ పంపుతోంది. కొత్త ఫీచర్లు అందించాలంటే పాత ఇంటర్ఫేస్‌ సరిపడదని యూట్యూబ్‌ చెబుతోంది.


9. శాంసంగ్‌ కొత్త ఫోన్లు ఇలా ఉంటాయ్‌
శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌లో కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి రావడానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో ఈ మొబైళ్లకు సంబంధించిన లైవ్‌ ఇమేజెస్‌ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా, గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌ మొబైల్స్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి. వాటి ప్రకారం చూస్తే అల్ట్రాలో వెనుకవైపు కెమెరాల కోసం దీర్ఘచతురస్రాకార బంప్‌ ఉండనుంది. అందులో మూడు కెమెరా సెన్సర్లు ఉంటాయి. అందులో ఒకటి 108 ఎంపీ కెమెరా అని సమాచారం. వీటితోపాటు పెరీస్కోప్‌ షూటర్‌, ఫ్లాష్‌ కూడా ఉంటాయి. బంప్‌ దిగువన మరో ఫ్లాష్‌‌, కెమెరా సెన్సర్‌ ఇస్తున్నారు. దీంతో 100X జూమ్‌ చేయొచ్చని తెలుస్తోంది. 


10. ₹7వేలకే 39 అంగుళాల టీవీ
దేశంలో బడ్జెట్‌ రేంజిలో మంచి ఫీచర్లతో టీవీలు వస్తున్నాయి. అయితే ఏడు వేల రూపాయలకే 39 అంగుళాల టీవీ వస్తోందంటే నమ్ముతారా. వాల్‌మార్ట్‌ ఈ బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. సీకీ బ్రాండ్‌కు చెందిన ఈ టీవీ.. వాల్‌మార్ట్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో వంద డాలర్లకు అందిస్తోంది. అయితే ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో మాత్రమే ఇస్తున్నారు.



కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.