‘ఆదిపురుష్‌’: ఆయన నటించడం లేదు..! - Ajay Devgn is NOT approached for playing any character in the Prabhas and Saif Ali Khan starrer
close
Published : 25/10/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆదిపురుష్‌’: ఆయన నటించడం లేదు..!

క్లారిటీ వచ్చేసింది

ముంబయి‌: బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ నేతృత్వంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా ‘ఆది పురుష్‌’. భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే మరో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం అజయ్‌ని సంప్రదించినట్లు.. ఆయన కూడా సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరచినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, తాజాగా ఈ వార్తలపై అజయ్‌ దేవ్‌గణ్‌ టీం స్పందించింది. ఇది అవాస్తమని తేల్చి చెప్పింది . ‘ఆదిపురుష్‌’లో పాత్ర గురించి ఇప్పటివరకూ ఎవరూ అజయ్‌ని కలవలేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలకు బ్రేక్‌ పడుతుందని అజయ్‌ టీం ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ సినిమా సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పటికే అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, కృతిసనన్‌ పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని