కన్నతల్లి ఇస్తుందట కరోనాను ఎదిరించే శక్తి!  - Antibodies develops in neonates of corona effected mother
close
Published : 28/12/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నతల్లి ఇస్తుందట కరోనాను ఎదిరించే శక్తి! 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే రోజు సమీపంలోనే ఉంది. అయితే వైరస్‌ గురించి కొన్ని విషయాలు నేటికీ వీడని చిక్కుముడిగానే ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణులకు కొవిడ్ సోకినప్పుడు పుట్టే శిశువు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ విషయంలో కాస్త స్పష్టత లభించే ఓ సంఘటన ఇటీవల జరిగింది. 

సింగపూర్‌కు చెందిన ఓ మహిళకు గత మార్చి నెలలో కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్న ఆమె సుమారు ఇరవై రోజుల చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. కొవిడ్‌ సోకిన సమయంలో గర్భిణీగా ఉన్న సదరు మహిళ కొవిడ్‌ నుంచి కోలుకున్న కొన్ని రోజుల తర్వాత నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో ఆ నవజాత శిశువుకు కరోనా లేదని పరీక్షల్లో తేలిందది. అంతేకాదు ఆ చిన్నారిలో కరోనాకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ శిశువుకు తల్లి నుంచే యాంటీబాడీలు లభించి ఉంటాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో తల్లి (గర్భిణీ) నుంచి శిశువుకు కొవిడ్‌ వస్తుందనే అనుమానాలపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం కరోనా బాధితురాలి కడుపులోని శిశువుకు వైరస్‌ సోకుతుందా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే.. గర్భస్థ శిశువుకు కొవిడ్ సోకటం అరుదని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో గర్భాశయ ద్రవాలు, తల్లిపాలు తదితరాల్లో కొవిడ్‌ లేనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. 

ఇవీ చదవండి

ఒకే చిత్రంలో కరోనా వర్తమానం, భవిష్యత్తు! 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని