గవర్నర్ ప్రవర్తనపై ప్రధాని మోదీతో మాట్లాడా..! - Ashok Gehlot says Spoke to PM yesterday over Governors behavior
close
Updated : 27/07/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గవర్నర్ ప్రవర్తనపై ప్రధాని మోదీతో మాట్లాడా..!

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ 

జైపూర్‌: రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ వ్యూహాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుమతివ్వాలంటూ సీఎం అశోక్‌గహ్లోత్‌ చేసిన సిఫారసును గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా మరోసారి తిరస్కరించారు. అసెంబ్లీని ఎలాగైనా సమావేశపర్చాలని భావిస్తున్న సీఎం తన వ్యూహాన్ని మార్చి.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపర్చాలని కోరినా గవర్నర్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సీఎం అశోక్‌గహ్లోత్‌ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడానన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయం సంక్షోభం నేపథ్యంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా తీరుపై ప్రధానికి వివరించినట్టు చెప్పారు. అలాగే,  ఏడు రోజుల క్రితం తాను రాసిన లేఖపైనా ప్రధానితో చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు.

గవర్నర్‌ మరోసారి తమకు ఆరు పేజీల ప్రేమలేఖ పంపారంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికైన ప్రభుత్వాలు అసెంబ్లీని సమావేశపరచాలనుకున్నప్పుడు గవర్నర్లు అనుమతివ్వాల్సి ఉంటుందన్నారు. గత 70 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేత, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాజస్థాన్‌లోని రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

భాజపా పిటిషన్ ‌కొట్టివేసిన హైకోర్టు

మరోవైపు, భాజపా దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. గతంలో కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు విలీనమైన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

ఫిరాయింపు రాజకీయాల గొంగడి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని